AP: బీసీ కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన, పెద్ద ఎత్తున పదవులు

దేశంలోనే తొలిసారిగా బీసీ కార్పొరేషన్లను ఏర్పర్చిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు పాలక మండళ్లను ప్రకటించింది. 56 పాలకమండళ్లను ప్రకటించడంతో పెద్దఎత్తున పదవుల పందేరం జరిగింది. పెద్ద సంఖ్యలో పదవులు దక్కడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Last Updated : Oct 18, 2020, 01:53 PM IST
AP:  బీసీ కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన, పెద్ద ఎత్తున పదవులు

దేశంలోనే తొలిసారిగా బీసీ కార్పొరేషన్లను ఏర్పర్చిన ఏపీ ప్రభుత్వం ( Ap Government )..ఇప్పుడు పాలక మండళ్లను ప్రకటించింది. 56 పాలకమండళ్లను ప్రకటించడంతో పెద్దఎత్తున పదవుల పందేరం జరిగింది. పెద్ద సంఖ్యలో పదవులు దక్కడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వం ( Ycp Government ) ఇప్పుడు కీలకమైన అడుగేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకు తగ్గట్టుగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పెద్దసంఖ్యలో బీసీ కార్పొరేషన్ల ( BC Corporations ) ను ఏర్పర్చింది. ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. భారీగా ఏర్పడిన కార్పొరేషన్లతో పదవుల పందేరం కూడా పెద్దసంఖ్యలోనే జరిగింది. ఒక్కొక్క పాలకమండలిలో ఒక ఛైర్మన్ తో పాట 13 మంది డైరెక్టర్లుంటారు. ఈ లెక్కన మొత్తం 728 మందికి ఒకేసారి గౌరవప్రదమైన పదవులు దక్కినట్టైంది. ఎన్నికల అనంతరం నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. 

కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలకమండళ్లను ఇవాళ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ ( Dharmana Krishnadas ), వేణుగోపాలకృష్ణ, బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ), అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నారాయణతో పాటు రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణలు ప్రకటించారు. ఇందులో 50 శాతం మహిళలక కేటాయిస్తూ అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించారు. జనాభా ప్రాతిపదికన బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు జరిగింది. 

కొత్తగా ఏర్పడిన బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు 6 దక్కగా, తరువాత కడప జిల్లాకు 5, విశాఖ జిల్లాకు 5 దక్కాయి. మిగిలిన అన్ని జిల్లాలకు సమానంగా 4 చొప్పున ఛైర్మన్ పదవులు లభించాయి. డైరెక్టర్ల పదవుల్లో ప్రతి కార్పొరేషన్ నుంచి అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. 

వెనుకబడిన కులాల ప్రాతిపదికన ఇంత పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. బీసీ ( Backward classes ) ల్లో ఉన్న 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ముందు భావించినా..కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉండటంతో ఆలోచన మార్చుకుంది ప్రభుత్వం. 30 వేలకు తగ్గకుండా జనాభా ఉన్న కులాలకే కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. బీసీ కార్పొరేషన్ల ద్వారా వెనుకబడినవర్గాలకు లబ్ది చేకూర్చేందుకు ఏడాదికి దాదాపు 20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. Also read: Visakha land scam: మళ్లీ ప్రారంభమైన సిట్ దర్యాప్తు

Trending News