శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న నిరుద్యోగ భృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక ప్రకటన చేశారు! ప్రస్తుతం ఇస్తోన్న రూ.1,000 నిరుద్యోగ భృతిని రానున్న కాలంలో రూ.3,000కు పెంచనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నరసన్నపేటలో జరిగిన టీడీపి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం ఇస్తోన్న రూ.1000 నిరుద్యోగ భృతిని ఏప్రిల్ 1 నుంచి రూ.2000కు పెంచి ఇవ్వాలని ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యేవరకు నిరుద్యోగ భృతి పెంచరాదని ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి రూ.2000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం అంతటితోనే నిలిచిపోయింది.