AP PRC: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్​ న్యూస్​- త్వరలోనే పీఆర్సీ!

AP PRC: ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ తీపు కబురు చెప్పారు. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 02:12 PM IST
  • ఉద్యోగులకు సీఎం జగన్​ తీపు కబురు
  • పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని వెల్లడి
  • త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని హామీ
AP PRC: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్​ న్యూస్​- త్వరలోనే పీఆర్సీ!

CM Jagan assures announcement of PRC soon: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య మంత్రి జగన్​మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియపూర్తయిందని.. మరో 10 రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని (CM Jagan on PRC) చెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్​.. ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్​.. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియ పూర్తయినట్లు (PRC in AP) వెల్లడించారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన 10 రోజుల్లో ఉంటుందని హామీ ఇచ్చారు.

పీఆర్​సీ రగడ..

రాష్ట్రంలో గత కొంత కాలంగా పీఆర్సీ విషయంలో ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాల మధ్య తీవ్ర చర్చలు జరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు పలు మార్లు నిరసన కూడా వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు ఈ విషయంపై నేడు క్లారిటీ వచ్చింది.

జగన్ పర్యటన ఇలా..

గత నెల రాయలసీమ సహా వివిధ ప్రాంతాల్లో కురిసి వర్షాలకు (AP rains) జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి జగన్​ సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా. నేడు తిరుపతిలో పర్యటిస్తున్నారు.

వరదల కారణంగా (AP Floods) నష్టపోయిన బాధితులతో మాట్లాడి వారికి అందిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అందిరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Also read: Jawad Cyclone Update: తుపానుగా మారనున్న అల్పపీడనం.. ఆ మూడు రాష్టాల్లో తీవ్ర ప్రభావం

Also read: Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్... రూ.120కోట్ల జరిమానా విధింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News