Southwest Monsoon: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు త్వరగా ప్రవేశించాయి. అంతేకాకుండా చురుగ్గా కదులుతూ రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకూ వ్యాపించాయి. రుతు పవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
ఏపీలో ఈసారి ముందుగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. నిన్న జూన్ 3వ తేదీ నాటికి రాయలసీమతో సాహా కోస్తాంద్ర వరకూ రుతు పవనాలు విస్తరించాయి. మరో 2-3 రోజుల్లో ఉత్తరాంధ్ర వరకూ విస్తరించి అక్కడ్నించి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వ్యాపించనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక అనకాపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షం పడింది.
ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులకు అవకాశముంది. ఇక గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతు పవనాల కారణంగా వర్షాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే ఏకంగా 10 డిగ్రీలు తక్కువ నమోదవుతోంది.
ఇక నైరుతి రుతుపవనాలకు తోడుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంతో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల్లో ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. దాంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
Also read: APPSC Group2 Mains: గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, జూలై 28న మెయిన్స్ పరీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook