AP Liquor Revenue: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక కొత్త మద్యం పాలసీ ప్రారంభమైంది. ఎప్పటిలానే తిరిగి ప్రైవేటుకు మద్యం అప్పగించింది ప్రభుత్వం. అదే సమయంలో క్వార్టర్ మద్యం 99 రూపాయలకు అందుబాటులో తీసుకొచ్చింది. అయినా సరే మద్యం ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మద్యం ఆందోళన పట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించేది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలను తిరిగి ప్రైవేటుకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మద్యం దుకాణాలు రెండు నెలల్నించి పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చేశాయి. క్వార్టర్ లిక్కర్ 99 రూపాయలకే ఇస్తామన్న హామీని అమల్లోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఉన్నట్టు కాకుండా నాణ్యమైన బ్రాండ్లనే విక్రయిస్తామని చెప్పింది. ఇన్ని చేసినా మద్యం ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం ప్రభుత్వానికి తలపోటుగా మారింది.
ప్రైవేటుకు మద్యం ప్రభావమే కారణమా
ప్రభుత్వం ప్రైవేటుకు మద్యం దుకాణాలు అప్పగించడంలో ఏకపక్షంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఎందుకంటే మద్యం దుకాణాల నిర్వహణ గత ప్రభుత్వంలో ఉన్నట్టే ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుందనేది ఆర్ధిక శాఖ సూచన. దీనివల్ల విక్రయాల్లో ఆదాయంలో అధిక భాగం ప్రభుత్వానికే వచ్చేది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మద్యం విక్రయాల రూపంలో చేరింది. కానీ ఇప్పుడు ప్రైవేటు హయాంలో మద్యం దుకాణాలుండటంతో ఆదాయం తగ్గిపోయింది. దీనికితోటు 99 రూపాయలకే క్వార్టర్ మద్యం హామీ అమ్మకాలపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం మద్యం అమ్మకాల్లో 99 రూపాయలకు క్వార్టర్ మందు ఇస్తున్న బ్రాండ్లు 25 శాతం వాటా కలిగి ఉన్నాయి.
99 రూపాయలకే మద్యం ప్రభావం
ఇది మద్యం ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోంది. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అమ్మకాలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. అటు షాపులకు కమీషన్ కూడా తగ్గిపోయింది. ఏపీలో నెలకు 30 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో 5.6 శాతంగాా ఉన్న 99 రూపాయల మద్యం అమ్మకాలు నవంబర్ నెల వచ్చేసరికి 14.85 శాతనికి చేరాయి. డిసెంబర్ 15 వరకు 15 రోజుల్లో ఇది 19.95 శాతానికి చేరింది. ఈ నెలాఖరుకు 25 శాతం కానుందని అంచనా. అంటే 30 లక్షల కేసుల్లో 8 లక్షల కేసులు ఇవే ఉంటున్నాయి.
నాణ్యమైన మద్యం అంటూ హామీ ఇస్తూనే 99 రూపాయలకే మద్యం అమ్మకాలు జరపడంతో చీప్ లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఎప్పుడూ చీప్ లిక్కర్ అమ్మకాలు ఇంత భారీ ఎత్తున లేవు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూపై గణనీయంగా ప్రభావం పడింది. కొన్ని లోటుపాట్లను సరిచేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆర్ధిక శాఖ నిపుణులు భావిస్తున్నారు.
Also read: Bank Holidays: జనవరిలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడు ఎక్కడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.