Andhra Pradesh Free Bus Scheme: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వస్తే మహిళల కోసం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తామని సూపర్ సిక్స్ ఎన్నికల హామిల్లో భాగంగా వాగ్ధానం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి సర్కారు.. ఎలక్షన్స్ ముందు ఏపీ సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధం అవుతోంది. తెలుగు ప్రజల కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లయినా, రోజుకు ఎంత దూరం ప్రయాణించినా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదట. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ పథకం మూలానా.. కర్ణాటకలో, తెలంగాణలో అక్కడి ప్రభుత్వాలు అన్ని వర్గాల మహిళలకు ఆధార్ కార్డు ఉంటే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి. దీని మూలంగా పురుషులకు బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. దీంతో పురుషులను నుంచి స్టూడెంట్స్ నుంచి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఎదురువుతున్నఅయి. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంతో తమకు గిరాకీలు లేవు అంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే కదా. మరి ఏపీలో ఈ పథకం అమలులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.
ఇప్పటికే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ‘మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఇప్పటికే అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు నాయుడు. APSRTC ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69 శాతం వరకూ ఉందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ. 265 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం ను సీఎంకు వివరించారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏది ఏమైనా ఉగాది నుంచి ఈ పథకాన్ని ఎలాగైనా అమలు చేయాలనే కృత నిశ్చయంతో కూటమి సర్కారు ఉంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.