Amalapuram Violence: కోనసీమ జిల్లా పేరు వివాదం రగడ కొనసాగుతూనే ఉంది. కోనసీమలో పోలీస్ పహార్ కొనసాగుతోంది. విధ్వంసకాండతో తల్లడిల్లిన అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. కోనసీమలో పరిస్థితి నివురుగప్పినా నిప్పులానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన జనాల్లో కొనసాగుతోంది. కోనసీమ సాధన సమితి చేపట్టిన నిరసనలో జరిగిన అల్లర్లు, విధ్వంసకాండపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అల్లర్లకు సంబంధించి 44 మందిని అరెస్ట్ చేశారు.
అమలాపురంలో జరిగిన విధ్వంస ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు పోలీసులు. మరికొందరిని కూడా అదుపులోనికి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమలాపురంలో జరిగిన ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తిస్తున్నారు పోలీసులు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురంలోనే ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లను ప్రేరేపించిన 20 వాట్సాప్ గ్రూప్స్ గుర్తించినట్లు తెలిపారు. ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుంచే రాబడతామన్నారు. నిందితుల ఆస్తులను సీజ్ చేస్తామన్నారు డీఐజీ పాలరాజు. అమలాపురంలో 144 సెక్షన్ మరో వారం రోజడులు పొడిగిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు పోలీసుల ఆంక్షలతో కోనసీమ ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ లేకపోవడంతో వాణిజ్య కార్యాకలాపాలకు అంతరాయం కల్గుతోంది. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఐటీ ఉద్యోగుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ఇంటర్ నెట్ కోసం జిల్లా సరిహద్దులకు వెళ్తున్నారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
READ ALSO:Pawan Kalyan: ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్! చంద్రబాబు ఫ్యాన్స్ పరేషాన్?
READ ALSO: Stampede: తిండి కోసం ఎగబడిన జనం.. తొక్కిసలాటలో 31 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook