US Interest Rate: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం, వడ్డరేట్లలో పెరుగుదల

US Interest Rate: కరోనా మహమ్మారి పరిణామాల్నించి కోలుకునేందుకు అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. సున్నా స్థాయి వడ్డీరేట్ల నుంచి క్రమంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా సంకేతాలిచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2021, 12:47 PM IST
US Interest Rate: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం, వడ్డరేట్లలో పెరుగుదల

US Interest Rate: కరోనా మహమ్మారి పరిణామాల్నించి కోలుకునేందుకు అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. సున్నా స్థాయి వడ్డీరేట్ల నుంచి క్రమంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా సంకేతాలిచ్చింది. 

కరోనా సంక్షోభం(Corona Crisis) కారణంగా ఎదురైన ఆర్ధిక పరిణామాలను ఎదుర్కొనేందుకు అమెరికా అన్ని విధాలా సమాయత్తమవుతోంది. 2020 మార్చ్ నుంచి కొనసాగిస్తున్న సున్నా వడ్డీని క్రమంగా పెంచేందుకు అడుగులు వేస్తోంది. ఈ విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. నియామకాలు పెరిగే కొద్దీ చౌక వడ్డీరేట్ల విధానాలను ఉపసంహరించేందుకు యోచిస్తున్నామన్నారు. 

వివిధ రకాల బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఏడాది చివర్లో తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం నిర్దేశిత 2 శాతానికి చేరుకోవడంతో బాండ్ల కొనుగోలు ప్రక్రియను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక వడ్డీరేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం ద్వారా..వ్యవస్థలో రుణాలు, వ్యయాలకు డిమాండ్ కల్పించేందుకు ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(America Federal Reserve Bank)..నెలకు 120 బిలియన్ డాలర్ల ట్రెజరీ బాండ్లను రీపర్చేజ్ చేస్తోంది. ఈ ప్రక్రియ నిలిచిపోతే తనఖా రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు మళ్లీ పెరుగుతాయి. రిజర్వ్ బ్యాంకు ఆలోచనలపై అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.

Also read: America Revenge: ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News