US Election 2024: అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది, తుది ఫలితాలు ఎప్పుడు

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. అగ్రరాజ్యంలో కూడా ప్రజాస్వామ్యమే అయినా ఎన్నికల ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కావడంతో ఆ ప్రక్రియే వేరేగా ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2024, 10:17 AM IST
US Election 2024: అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది, తుది ఫలితాలు ఎప్పుడు

US Election 2024: అమెరికాలోలో జరిగేవి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ఎన్నికలు. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధినిగా కమలా హ్యారిస్ వర్సెస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ గట్టిగా ఉంది. అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఫలితాలు ఎప్పుడొస్తాయనే వివరాలు పరిశీలిద్దాం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇండియాలో జరిగే ఎన్నికల్లా సులభంగా ఉండదు. సంక్లిష్టమైన ప్రక్రియే. పార్టీ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియే నెలల తరబడి కొనసాగుతుంది. ఆ తరువాత ఓటింగ్ లో ప్రజలే కాకుండా రాష్ట్రాలు, పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయి. అమెరికా ఎన్నికల ప్రక్రియలో ప్రైమరీ, కాకస్ అనేవి రెండు ప్రధాన దశలు. రాజకీయ పార్టీలు తమ అధ్యక్షఅభ్యర్ధిని ఎంపిక చేసుకునేందుకు ఈ ప్రక్రియ ఉంటుంది. పార్టీ సభ్యులు, మద్దతుదారుల అభిప్రాయం ఆధారంగా అభ్యర్ధి ఎన్నిక ఉంటుంది. కాకస్ ప్రక్రియ ప్రకారం ముఖ్యమైన సభ్యులు ఓ చోట సమావేశమై నచ్చిన అభ్యర్ధికి మద్దతిస్తారు. చర్చలు జరుగుతాయి. గ్రూపులుగా విడిపోయి నచ్చిన అభ్యర్ధికి మద్దతిస్తారు. 

ఇక రెండవ పద్ధతి ప్రైమరీ. ఇందులో పార్టీ సభ్యులు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ఎవరికైనా ఎక్కువ ఓట్లు లభిస్తాయో ఆ వ్యక్తే ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి అవుతాడు. ఈ రెండు దశల తరువాత జాతీయ సమావేశంలో అధ్యక్ష అభ్యర్ధిని ఎన్నుకుంటారు. 

ఇక ఇప్పుడు మిగిలింది అసలైన అధ్యక్షుడి ఎన్నిక. ప్రజలంతా కలిసి అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓట్లేస్తారు. ప్రతి నాలుగేళ్లకు నవంబర్ మొదటి మంగళవారంలో ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. ఎలక్టోరల్ కాలేజీ అనేది ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు ఓటు వేసి ఎవరు అధ్యక్షుడో నిర్ణయించే ప్రక్రియ. అమెరికాలో ఎలక్టోరల్ ఓట్లు మొత్తం 538 ఉన్నాయి. ఇందులో 270 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు పొందిన అభ్యర్ధి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. ఈ ప్రక్రియ డిసెంబర్ నెలలో జరుగుతుంది. జనవరిలో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉంటుంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా, నెవాడా, అరిజోనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ వంటి స్వింగ్ రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో నెవాడా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ స్వల్ప ఆధిక్యంలో ఉంటే..ఆరిజోనా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. 

Also read: Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News