Solar Eclipse: 2022 తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ కన్పిస్తుంది

Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఐదురోజుల్లో ఉంది. ఏప్రిల్ 30న ఏర్పడనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కన్పించడం లేదు. సూర్యగ్రహణం ఎక్కడ ఎలా కన్పించనుందో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2022, 03:41 PM IST
  • 2022 లో తొలి పాక్షిక సూర్యగ్రహణం ఏప్రిల్ 30 తేదీన
  • సూర్యగ్రహణం ఇండియాలో కన్పిస్తుందా లేదా
  • సూర్యగ్రహణం ఏయే దేశాల్లో, ఏ సమయంలో, ఎలా కన్పించనుంది
Solar Eclipse: 2022 తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ కన్పిస్తుంది

Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఐదురోజుల్లో ఉంది. ఏప్రిల్ 30న ఏర్పడనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కన్పించడం లేదు. సూర్యగ్రహణం ఎక్కడ ఎలా కన్పించనుందో పరిశీలిద్దాం..

తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30, 2022లో ఏర్పడనుంది. ఇండియాలో కన్పించనున్నా సరే..తొలి సూర్యగ్రహణం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మతపరమైన విశ్వాసాలతో ఇంకొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సూర్య గ్రహణం ఎక్కడ , ఏ సమయంలో, ఎలా కన్పించనుందనే వివరాల్ని నాసా వెల్లడించింది. 

2022 తొలి సూర్య గ్రహణం మరో ఐదురోజుల్లో ఏర్పడనుంది. ఏప్రిల్ 30, 2022 శనివారం నాడు ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది తొలి పాక్షిక సూర్య గ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్రప్రాంతాల ప్రజలు ఏప్రిల్ 30వ తేదీ సూర్యాస్తమయానికి కొద్దిగా ముందు పాక్షిక సూర్య గ్రహణం చూడనున్నారు. చిలీ, అర్జెంటీనీ, ఉరుగ్వే, పశ్చిమ పరాగ్వే, నైరుతి బొలీవియా, ఈశాన్య పెరూ, నైరుతి బ్రెజిల్ దేశాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటే..సూర్యాస్తమయం సమయంలో పాక్షిక సూర్య గ్రహణం కన్పించనుందని నాసాకు చెందిన సోలార్ సిస్టమ్ ఎక్స్‌ప్లొరేషన్ వెల్లడించింది. 

అదే విధంగా అంటార్కిటికాకు చెందిన నార్త వెస్టర్న్ తీరప్రాంతం, దక్షిణ అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ భాగం,  దక్షిణ పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాల్లో సూర్యగ్రహణం కన్పించనుంది. అయితే ఇండియాలో మాత్రం కన్పించదని నాసా తెలిపింది. అసలు సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుందో పరిశీలిద్దాం..

సూర్య గ్రహణమంటే ఏంటి

సూర్యుని చుట్టూ భూమి...భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించే క్రమంలో కొన్ని సమయాల్లో సూర్యునికి చంద్రునికి సరిగ్గా మధ్య భాగంలో చంద్రుడు వస్తాడు. అలా జరిగినప్పుడు చంద్రుడి నీడ భూమిపై సంపూర్ణంగానో లేదా పాక్షికంగానో పడుతుంది. సూర్యకిరణాల్ని చంద్రుడు భూమిపై పడకుండా కాస్సేపు అడ్డుకుంటాడు. పాక్షిక సూర్యగ్రహణమైతే..సూర్యునికి చంద్రునికి సరిగ్గా మధ్యలో చంద్రుడి స్థితి ఉండదు. దాంతో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయదు. ఫలితంగా సూర్యుడు క్రిసెంట్ షేప్‌లో లేదా కొరికినట్టుగా కన్పిస్తాడు. ఇది పూర్తిగా చంద్రుడు సూర్యుడిని ఎంతభాగం కవర్ చేశాడనేదానిపై ఆధారపడి ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణమైతే..సూర్యుడు, చంద్రుడు, భూమి..మూడూ సమాంతర రేఖపై ఉంటాయి.

పాక్షిక సూర్యగ్రహణం క్షేమంగా చూడటమెలా

సూర్య గ్రహణం సంపూర్ణమైనా లేదా పాక్షికమైనా సరే నేరుగా ఎప్పుడూ సూర్యుడిని చూడకూడదు. దీనికోసం సోలార్ ఫిల్టర్ అవసరం. పాక్షిక సూర్యగ్రహణం వీక్షించేటప్పుడు ప్రత్యేకమైన కళ్లజోడు ధరించాలి. ఇవి రెగ్యులర్ కళ్లజోడుకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో అవి లేకపోతే.. పిన్ హోల్ ప్రోజెక్టర్ ద్వారా చూడవచ్చు. 

Also read: Mars Solar Eclipse: ఇతర గ్రహాల్లో కూడా సూర్య గ్రహణాలుంటాయా..ఎలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News