Hajj 2021: కరోనా వైరస్ ప్రభావం పవిత్రమైన హజ్ యాత్రపై మరోసారి పడుతోంది. హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హజ్ విధానాన్ని ప్రకటించింది.
ముస్లింలకు పవిత్రమైనంది హజ్ యాత్ర(Hajja Yatra). సౌదీ అరేబియాలోని మక్కాను ఏడాదికోసారి బక్రీద్ పండుగ సమయంలో సందర్శిస్తుంటారు. ప్రతియేటా వివిధ దేశాల్నించి లక్లలాదిమంది భక్తులు మక్కాను సందర్శిస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండవ ఏడాది హజ్ యాత్రపై ప్రభావం పడుతోంది. 2020లో కరోనా వైరస్ సంక్రమణను దృష్టిలో ఉంచుకుని హజ్ యాత్రకు కేవలం సౌదీ అరేబియన్లకు మాత్రమే అనుమతించి..విదేశీయులను నిరాకరించింది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా వరుసగా రెండవ యేడాది కూడా హజ్ యాత్రకు విదేశీయులకు అనుమతించడం లేదు. 2021 ఏడాదికి సంబంధించి సౌదీ అరేబియా (Saudi Arabia) కొత్త హజ్ విధానాన్ని (New Hajj policy) ప్రకటించింది. దీని ప్రకారం కేవలం 60 వేలమంది సౌదీ అరేబియాలో నివసించే ప్రజలే హజ్ యాత్రలో పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి(Corona pandemic) రోజురోజుకూ విభిన్న వైవిద్యాల్ని ప్రదర్శిస్తోందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ మంత్రి తౌఫీక్ అల్ రబియా తెలిపారు. కరోనా సంక్రమణకు ముందు వరకూ ప్రతి యేటా 2.5 మిలియన్లమంది మక్కా, మదీనా సందర్శించేవారు.
Also read: FDA Rejects Covaxin: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశే, అనుమతి ఇవ్వని FDA
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook