Japan Army Helicopter Crashed Into Sea: జపాన్‌లో 10 మంది సిబ్బందితో బయల్దేరిన ఆర్మీ హెలీక్యాప్టర్ ఆచూకీ గల్లంతయ్యింది. మియాకో ఐలాండ్ నుంచి టేకాఫ్ అయిన ఆర్మీ హెలీక్యాప్టర్ UH-60JA బ్లాక్ హాక్ టేకాఫ్ అయిన గంట తరువాత రాడార్స్ నుంచి అదృశ్యమైనట్టు తొలుత వార్తలొచ్చాయి. గురువారం మధ్యాహ్నం తరువాత హెలీక్యాప్టర్ అదృశ్యమైనట్టుగా జపాన్ ఆర్మీకి మొదట సమాచారం అందింది. అప్పటి నుంచే అదృశ్యమైన జపాన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కోసం అన్వేషణ ప్రారంభమైంది.
అదృశ్యమైన జపాన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కోసం జపాన్ నేవీ బలగాలు, ఎయిర్ ఫోర్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలోనే జపాన్ ఆర్మీకి ఓ దుర్వార్త అందింది. సౌతెర్న్ ఐలాండ్‌కి పక్కనే ఉన్న సముద్రంలో కొన్ని శకలాలు కనిపించాయని.. అవి అదృశ్యమైన హెలీక్యాప్టర్‌కి చెందినవే అయ్యుంటాయని భావిస్తున్నట్టు జపాన్ సర్కారుకి సమాచారం అందింది.
జపాన్‌కి చెందిన క్యోడో న్యూస్ కథనం ప్రకారం జపాన్ కోస్ట్ గార్డ్స్ షిప్స్ సైతం సముద్రంలో అన్వేషిస్తుండగా.. సముద్రంలో ఒక చోట ఆయిల్ ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ఆయిల్ ఆనవాళ్లు కూలిపోయిన హెలీక్యాప్టర్ కి చెందినవే అయ్యుంటాయని జపాన్ కోస్ట్ గార్డ్ షిప్స్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేశారు. అయితే, ఇదే విషయాన్ని ధృవీకరించడానికి మాత్రం వారు నిరాకరించారు.
నైరుతి జపాన్‌లో ఇటీవల కాలంలో జపాన్ తమ భద్రత బలగాలను అధిక సంఖ్యలో మొహరిస్తోంది. అందుకు కారణం పొరుగునే ఉన్న చైనా ఇటీవల కాలంలో నైరుతి జపాన్ కి ఆనుకుని ఉన్న చైనా ప్రాంతంతో పాటు తైవాన్ దిశగాను భారీ సంఖ్యలో బలగాలను మొహరించి ఆయా ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో చైనా కుటిల యత్నాలని తిప్పికొట్టే ప్రయత్నాల్లో భాగంగా జపాన్ అక్కడ భద్రతా బలగాలను కట్టుదిట్టం చేసి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగానే ఆర్మీ విధుల్లో ఉన్న హెలీక్యాప్టర్ అదృశ్యమైంది.
అదృశ్యమైన హెలీక్యాప్టర్‌లో 10 మంది ప్రయాణికులు ఉండటం ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తోంది. సౌతెర్న్ ఐలాండ్‌ని ఆనుకుని ఉన్న సముద్రంలో హెలీక్యాప్టర్ శకలాలు ఉన్నట్టు గుర్తించడం, ఆయిల్ ఆనవాళ్లు కనిపించాయన్న వార్తల నేపథ్యంలో జపాన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే కానీ జరిగితే అందులో ఉన్న 10 మంది సిబ్బంది సైతం మృత్యువాత పడే ప్రమాదం ఉందని జపాన్ ఆర్మీవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. జపాన్ ఆర్మీ హెలీక్యాప్టర్ మిస్సింగ్ ఘటనపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా స్పందిస్తూ.. " అదృశ్యమైన ఆర్మీ హెలీక్యాప్టర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది" అని అన్నారు.
ఇది కూడా చదవండి : Monkey Funny Video: వీడియో కోసం కోతికి అన్నం పెట్టింది.. ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు
ఇది కూడా చదవండి : Lions Hunting Newborn Buffalo Calf: గుండెల్ని పిండేసే వీడియో.. అప్పుడే పుట్టిన దూడను చుట్టుముట్టిన సింహాలతో తల్లి ఒంటరి పోరాటం
ఇది కూడా చదవండి : Python Snake Swallows Cow: పెద్ద ఆవును మింగిన భారీ ఆనకొండ.. ఈ టెర్రిఫిక్ వీడియో చూస్తే షాకవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK