Kenya Deaths: భయానక ఘటన.. జీసస్‌ను కలిసేందుకు ఆకలితో అలమటించి 47 మంది ఆత్మహత్య..!

47 Dead Bodies Found In Kenya: ఓ చర్చి పాస్టర్ ఇచ్చిన సూచనతో అమాయక ప్రజలు ప్రాణాలను బలితీసుకున్నారు. యేసును కలుస్తామనే నమ్మకంతో ఆకలితో అలమటించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కెన్యాలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 24, 2023, 08:48 AM IST
Kenya Deaths: భయానక ఘటన.. జీసస్‌ను కలిసేందుకు ఆకలితో అలమటించి 47 మంది ఆత్మహత్య..!

47 Dead Bodies Found In Kenya: ఆఫ్రికాలోని కెన్యాలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జీసస్‌ను కలవాలనే కోరికతో ఓ మత పెద్ద సూచనతో 47 మంది ఆకలితో అలమటించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. యేసును కలుసుకోవాలంటే ఉపవాసంతో మరణించాలని క్రైస్తవ మతగురువు చెప్పడంతో మూఢ నమ్మకంతో ప్రాణాలు బలితీసుకున్నారు. కిల్ఫీ ప్రావిన్స్‌లోని షాకహోలా అటవీ ప్రాంతంలో పోలీసులు మృతదేహాలను తీస్తున్నారు. కెన్యాలోని షాకహోలా అడవుల్లో మృతదేహాలు లభ్యమవుతున్నాయి. ఆదివారం మరో 26 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

గుడ్‌న్యూస్‌ ఇంటర్నేషనల్‌ చర్చ్‌కి చెందిన పాస్టర్‌ మెకింజీ ఎన్‌థాంగే తనను అనుసరిస్తున్న వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మీకు యేసును కలుసుకోవాలని ఉంటే.. ఉపవాసం ఉండి ఆకలి అలమటించి మరణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకలితో అలమటించి చనిపోయిన తరువాత పాతిపెట్టినట్లయితే.. వారు యేసును కలుసుకుని పరలోకానికి వెళ్తారని చెప్పారు. దీంతో ఆయన మాటలకు ప్రేరేపితులైన అమాయక ప్రజలు ఆకలితో ప్రాణాలు తీసుకున్నారు. 

చర్చి పాస్టర్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు కెన్యా పోలీసులు. మృతదేహాలను బయటకు తీసే పనులు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. తాను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని.. 2019లోనే తాను చర్చిని మూసివేసినట్లు ఆయన చెబుతున్నారు. ప్రజలు ఆకలితోనే మరణించారని నిరూపించేందుకు పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుల డీఎన్‌ఏ నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. 

Also Read: Girlfriend Acid Attack: మరో యువతితో ప్రియుడికి పెళ్లి.. వధూవరులపై యాసిడ్‌తో ప్రియురాలు దాడి

గతంలో కూడా పాస్టర్ పాల్ మెకంజీ ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పట్లో జరిమానా చెల్లించి.. జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ నెల 14న 11 మంది మృతదేహాలను పోలీసులు కనుగొనగా.. పాస్టర్‌పై అనుమానంతో అరెస్ట్ చేసి విచారించగా ఈ భయాకన ఘటన వెలుగుచూసింది. మరో 11 మంది ఉపవాసం ఉండగా.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News