అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ( America vice president kamala harris ) భారతీయ సంతతికి చెందినవారని..ఆమెకిక్కడ బంధువులున్నారని అందరికీ తెలిసిందే. అయితే అధ్యక్షుడు జో బిడెన్ ( Joe Biden ) కు కూడా ఇండియాలో బంధువులున్నారని తెలుసా మీకు..
అనగా అనగనగా...ఒకానొకప్పుడు గ్రాండ్..గ్రాండ్..గ్రాండ్ ఫాదర్ ..దశాబ్దాల క్రితం ఇండియాలో సెటిల్ అయ్యారు. ఆ వంశాంకురమే ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ( America new president Joe Biden ). ఆశ్చర్యంగా ఉందా. నిజమే..2013లో ముంబాయి పర్యటనలో స్వయంగా బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన దూరపు బంధువులు ముంబాయిలో ఉన్నారని చెప్పారు.
ఆ తరువాత రెండేళ్ల అనంతరం వాషింగ్టన్ లో తన వ్యాఖ్యల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ముంబాయి ( Mumbai ) లో ఐదుగురు బిడెన్ ( Five Bidens in india ) లు ఉన్నారని చెప్పారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఇప్పుడు ప్రమాణ స్వీకరం చేయబోతున్నారు. అయితే ముంబాయి నుంచి లేదా ఇండియా నుంచి ఎవరూ ఇప్పటివరకూ బిడెన్ బంధువులమంటూ చెప్పుకోలేదు. అసలు తన బంధువులు ఇండియాలో ఉన్నారనే విషయం బిడెన్ కు ఎలా తెలిసిందనేది వింటే ఆశ్చర్యం కలుగుతుంది. Also read: US New President: నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: జో బిడెన్
కొన్ని దశాబ్దాల క్రితం జో బిడెన్.. సెనేటర్ అయినప్పుడు ముంబాయి నుంచి బిడెన్ పేరుతో అతనికొక లేఖ వచ్చింది. ఆ లేఖ చూసిన తరువాత బిడెన్ కు గుర్తొచ్చింది తన గ్రాండ్..గ్రాండ్..గ్రాండ్..గ్రాండ్ ఫాదర్ ఇండియాలో ఉండేవారని..ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇండియాలో ఐదుగురు బిడెన్ లున్నారని అప్పుడే చెప్పారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా ముంబాయి ( Biden Mumbai visit ) పర్యటించినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు జో బిడెన్. ఇండియాకు..ముఖ్యంగా ముంబాయికి తిరిగి రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు బిడెన్. అయితే తాను సెనేటర్ గా ఉన్నప్పుడు వచ్చిన లేఖను ఫాలోఅప్ చేయకపోవడంపై బాధ పడుతున్నానన్నారు.
ఇక్కడున్న ప్రేక్షకుల్లో ఎవరైనా ఇది ఫాలో అప్ చేస్తారనుకుంటున్నాను. నా పేరు బిడెన్..ముంబాయి నుంచి..మనం బంధువులమని అనుకుంటున్నాను అని ఆ లేఖలో రాసిన సంగతిని గుర్తు చేశారు.
ఆ తరువాత 2015లో...గ్రాండ్.. గ్రాండ్..గ్రాండ్ ఫాదర్ అయిన జార్జ్ బిడెన్ ( George Biden ) ఈస్ట్ ఇండియా కంపెనీ కెప్టెన్ ( East India company captain in india ) గా ఇండియాలో ఉండి..అక్కడే ఓ భారతీయ మహిళను పెళ్లి చేసుకున్నారని బిడెన్ స్వయంగా చెప్పారు. అమెరికాలోని భారతీయ పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన ఓ సమావేశంలో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు. Also read: Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!