US Snow Toofan: అమెరికాలో గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తోందని యూఎస్ కు చెందిన నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపింది. మధ్య అమెరికాలో మొదలైన మంచు తుపాను తూర్పు దిశగా కదులుతోందని హెచ్చరించింది. ఈ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది. ముఖ్యంగా కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మామూలుగా చలి అంతగా ఉండని మిసిసిపీ, ఫ్లోరిడా రాష్ట్రాలూ మంచు బారిన పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే దీనికి రీజన్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ, బాల్ట్మోర్, ఫిలడెల్ఫియా నగరాలను మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు మేర మంచు కప్పబడి పోయింది. అటు కాన్సాస్, ఇండియానా రాష్ట్రాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. మిస్సోరీ, ఇల్లినాయీ, కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోనూ భారీగా మంచు కురియనుంది. విమాన సర్వీసులు డిలే అవుతున్నాయి.
మరోవైపు ఐరోపా అంతటా భారీగా మంచు వర్షం కురుస్తోంది. బ్రిటన్, జర్మనీల్లో ప్రధాన నగరాల్లో హిమపాతంతో ప్రజా జీవనానికి అంతరాయం కలిగింది. దీంతో విమానాలు ఎక్కడిక్కడ నిలిపేశారు. బ్రిటన్‌లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జరగాల్సిన క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దయ్యాయి. దక్షిణ ఇంగ్లాండ్‌లో ఎనిమిదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జర్మనీలో మంచు బీభత్సం దృష్ట్యా బ్లాక్ ఐస్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరు ఇళ్లలోనే ఉండాలని సూచించారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది. మంచు కారణంగా ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో రాకపోకలన్నీ రద్దయ్యాయి. రైలు ప్రయాణాలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి