Turkey: వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్ లోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 66 మంది సజీవదహనమైనట్లు ఆ దేశ మంత్రి అలియెర్లికాయ తెలిపారు. మరో 51 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, విలేకరులతో మాట్లాడారు.ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మెమిసోగు పేర్కొన్నారు.
బోలు ప్రావిన్స్ లోని కర్తాల్కాయ రిసార్టులోని 12 అంతస్తుల గ్రాండ్ కర్తలో హోటల్ రెస్టారెంట్ లో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 234 మంది హోటల్లో ఉన్నట్లు తెలిపారు.
కాగా ఇద్దరు వ్యక్తులు హోటల్ పై నుంచి భయంతో దూకి మరణించినట్లు తెలిపారు. కొందరు బెడ్ షీట్లు దుపట్లను తాడుగా మార్చుకుని గదుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. హోటల్ లో బస చేసిన సమయంలో తాను నిద్రపోతున్నానని ఆతర్వాత భవనం నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లాలని స్కీ ఇన్ స్ట్రక్టర్ నెక్మీ కెప్సెటుతున్ తెలిపారు.
Also Read: Zomato Share: ఫుడ్ డెలవరీ యాప్‌కు భారీ షాక్.. షేర్లు ఎలా కుప్పకూలాయో చూడండి.. ఇదే కారణం..!
తర్వాత 20 మందిని తరలించేందుకు సహాయం తీసుకున్నట్లు తెలిపారు. కొద్దిసేపట్లోనే హోటల్ అంతా మంటలు వ్యాపించాయని..జనాన్ని బయటకు తీసుకువచ్చేందుకు కష్టంగా మారిందని తెలిపారు. హోటల్ లో ఉన్న అగ్నిమాపక వ్యవస్థ పనిచేయలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హోటల్ లో ఉన్నఫైర్ అలారం మోగలేదని ఓ వ్యక్తి తెలిపాడు. హోటల్ లో ప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న హోటల్స్ ను కూడా ఖాళీ చేయించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి