YS Jagan Residence: నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగిసింది.