AP Government: ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు.
AP Government: ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు. వేల బాటిళ్లను జేసీబీ కిందవేసి తొక్కించారు. దాదాపు ఐదులక్షల విలువైన మద్యాన్ని చూస్తుండగానే జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశారు. చీరాల పరిసర పోలీస్స్టేషన్ల పరిధిలో ఏడాదిన్నర కాలంగా వేల బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.