యుద్ధమే సమస్యకు పరిష్కారం కాదని గ్రహించిన అమెరికా - ఉత్తర కొరియా చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా తొలి అడుగుపడింది. ట్రంప్ తో కిమ్ జాంగ్ భేటీకి తేదీ ఖరారైంది. జూన్ 12న సింగపూర్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. శనివారం వైట్ హౌస్ లో ఉత్తర కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్ తో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ఈ మేరకు భేటీకి సంబంధించిన ఈ తేదీని ఖరారు చేశారు. కొరియాను అణు రహిత దేశంగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ట్రంప్, కిమ్ ల భేటీ జరుగుతోంది.
ఇది ఆరంభం మాత్రమే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసిన సందర్భంలో ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జాంగ్ పంపిన లేఖను ట్రంప్ కు కిమ్ యోంగ్ చోల్ అందించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అణురహిత దేశంగా కొరియాను మార్చడమన్నది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని ... ఇది ఒక్క సమావేశంతోనే అయిపోయేది కాదన్నారు. కిమ్ జాంగ్ తో తన సమావేశం ఫలప్రదం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.