Amit Shah On BJP CM Candidate: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో జరిగిన భారీ జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సాధారణంగా బీజేపీ ఎప్పుడు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు. అయితే తెలంగాణలో మాత్రం బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అమిత్ షా. రాహుల్ గాంధీ కోసం సోనియా గాంధీ, కేటీఆర్ కోసం కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని అన్నారు.
కుటుంబ సంక్షేమం కోసమే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తాయని.. రాష్ట్రంలోని పేదల బాగుకోసం బీజేపీ పని చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నాయని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ దళితులు, బీసీలకు అన్యాయం చేసిందని.. దళిత ముఖ్యమంత్రి హామీని కేసీఆర్ విస్మరించాడని గుర్తుచేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు.. ఆ హామీ ఏమైంది..? అని అమిత్ షా ప్రశ్నించారు. బీసీలకు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది..? నిలదీశారు.
తప పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే.. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పగలడా..? అని అడిగారు. గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యమని.. తెలంగాణకు ఆ రెండు పార్టీలు ఏమి చేయలేదని మండిపడ్డారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ఇటీవలే మంజూరు చేసిన ట్రైబల్ వర్శిటీకి సమ్మక్క-సారక్క పేరును నిర్ణయించామని.. ఈ ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని చెప్పారు. కృషా జలాల సమస్య పరిష్కారానికి ఇటీవలే కొత్త ట్రిబ్యూనల్ ప్రకటించామన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చామన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు.
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook