Puvvada Ajay Kumar: పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించండి..మంత్రి పువ్వాడ అజయ్‌ కీలక వ్యాఖ్యలు..!

Puvvada Ajay Kumar: గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 19, 2022, 01:56 PM IST
  • గోదావరికి తగ్గిన వరద
  • సహాయక చర్యలు ముమ్మరం
  • కీలక వ్యాఖ్యలు చేసిన పువ్వాడ
Puvvada Ajay Kumar: పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించండి..మంత్రి పువ్వాడ అజయ్‌ కీలక వ్యాఖ్యలు..!

Puvvada Ajay Kumar: పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. పోలవరం ప్రాజెక్ట్‌ నుంచి నీళ్లు వదలడం ఆలస్యం కావడం వల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని చెప్పారు. భద్రాచలానికి ఇరువైపులా కరకట్టలను కట్టించేందుకు..ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. 

వెయ్యి కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇందుకు ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారని చెప్పారు. పోలవం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని..దీనిపై మొదటి నుంచి నిరసన తెలుపుతున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్.

ఇప్పుడు కనీసం ఐదు గ్రామాలనైనా తిరిగి తెలంగాణలో కలపాలని తాము గట్టి అడుగుతున్నామని తెలిపారు. ఈపార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై బిల్లు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. వరదల నుంచి గిరిజనులను కాపాడుకోగలిగామని చెప్పారు. త్వరలో వరద సాయం బాధితుల ఖాతాల్లో చేరుతుందని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చి ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలం ప్రాంతానికి ముప్పు ఉందని..దాని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Also read:Acharya: ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు... మరో ఘోర పరాభవం?

Also read:Rupee Drops: రూపాయి ఢమాల్.. చరిత్రలో తొలిసారిగా 80కి పతనమైన దేశీ కరెన్సీ...  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News