Ordinance on Pension Cut | కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందంటూ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు ప్రజా ప్రతినిధుల చెల్లింపుల్లో తెలంగాణ సర్కార్ కోత విధించడం తెలిసిందే. అయితే జీతాలతో పాటు ఆఖరికి పెన్షన్లలోనూ కోత విధించడంపై పిటిషన్లు దాఖలు కాగా, ఏ హక్కుతో ఇలా చేశారంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో రాత్రికి రాత్రే (జూన్ 16న) చెల్లింపుల్లో కోతపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ (Telangana Ordinance on Pension Cut)ను తీసుకురావడాన్ని టీఎస్‌యూటీఎఫ్ ఖండించింది. రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఆ ఆర్డినెన్స్‌పై టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) తీవ్రంగా స్పందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల చెల్లింపులపై కోర్టులో సమాధానం చెప్పుకోలేక రాత్రికిరాత్రే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారంటూ విమర్శించారు. ఇది ప్రభుత్వపు దుర్మార్గపు విధానమండూ మండిపడింది. ఇప్పటికే గత 3 నెలలుగా వేతనాల్లో కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ సర్కార్ రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని టీఎస్‌యూటీఎఫ్ ఖండించింది. బికినీలో సన్నీలియోన్ Photos వైరల్
ఇప్పటికీ మించిపోలేదని వేతనాలు, పెన్షన్ల కోతలపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకుని, జూన్ నుండి పూర్తి వేతనాలు చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. కాగా, ఏవైనా విపత్తులు సంభవించినా, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భాలలో ఏ సంస్థకైనా, వ్యక్తులకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులు వాయిదా వేసే అధికారం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆ ఆర్డినెన్స్ (Ordinance on Pay Cut)ను తీసుకొచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ