Telangana 10th Results: రేపే తెలంగాణ 10వ తరగతి ఫలితాలు.. ఇలా చూసుకోవచ్చు

ఈ రోజే తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. రేపు బుధవారం రోజున 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2023, 04:33 PM IST
Telangana 10th Results: రేపే తెలంగాణ 10వ తరగతి ఫలితాలు.. ఇలా చూసుకోవచ్చు

Telangana 10th Results: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు రేపు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఫలితాలను బుధవారం విడుదల చేయబోతున్నట్లుగా విద్యాశాక అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఫలితాల విడుదల విషయమై నెలకొన్న సందిగ్దం నేపథ్యంలో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 

ఫలితాల విడుదలకు సంబంధించిన సాప్ట్‌ వేర్ ని కూడా సిద్ధం చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా ఫలితాలను విడుదల చేసేందుకు ఒకటికి రెండు సార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అధికారులకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. 

గతంలో పరీక్ష ఫలితాల విడుదల సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులు బుధవారం tsbie.cgg.gov.in వెబ్‌సైట్ లో రిజల్ట్ ను చూసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా పలు వెబ్‌ సైట్స్ వారు కూడా పరీక్ష ఫలితాలను అందుబాటులో ఉంచబోతున్నారు. 

పదవ తరగతి పరీక్ష పేపర్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. ఆ మార్క్స్‌ అన్నింటిని కూడా ఆన్‌ లైన్ చేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రేపు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.8 లక్షల మంది విద్యార్థులు ఈసారి పదవ తరగతి పరీక్షకు హాజరు అయ్యారు. 

Also Read: Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పదవతరగతి ఫలితాలు విడుదల అవ్వబోతున్నాయి. నేడు ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఒక్క రోజు తేడాతోనే పదవ తరగతి ఫలితాలను విడుదల చేయబోతున్న నేపథ్యంలో విద్యా శాఖ అధికారులను పలువురు అభినందిస్తున్నారు. 

పదవ తరగతి పరీక్ష ఫలితాల కోసం ప్రత్యేకంగా వెబ్‌ సైట్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా యాప్స్ ను కూడా రూపొందించారని తెలుస్తోంది. రేపు మీడియా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేసిన తర్వాత అధికారులు అన్ని విషయాలను గురించి మీడియా ద్వారా విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది.

Also Read: Jangaon MLA Muthireddy Yadagiri Reddy: ప్రత్యర్ధులు నా బిడ్డను ఉసిగొల్పారు.. ఫోర్జరీ కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్ ఇదే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News