Telangana: తెలంగాణలో కరోనా కేసులు, మరణాలపై లేటెస్ట్ బులెటిన్

Telangana COVID-19 latest health bulletin: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,961 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2021, 01:02 AM IST
Telangana: తెలంగాణలో కరోనా కేసులు, మరణాలపై లేటెస్ట్ బులెటిన్

Telangana COVID-19 latest health bulletin: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,961 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,985 కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,559 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,80,458 కి చేరుకుంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 90.17 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Also read : Aarogyasri: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం

ఇదిలావుంటే, తెలంగాణలో లాక్‌డౌన్ (Lockdown in Telangana) కఠినంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముగ్గురు పోలీస్ కమిషనర్లను అభినందించిన హై కోర్టు.. మరో పిటిషన్ విషయంలో తెలంగాణ సర్కారుపై అక్షింతలు వేసింది. ప్రవైటు ఆస్పత్రుల్లో ధరల నియంత్రణ, బెడ్స్ అందుబాటులో లేకపోవడం, ఇంత కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న కాంటాక్ట్ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana govt) హై కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News