SLBC Tunnel Update: తెలంగాణలో SLBC శ్రీశైలం ప్రాజెక్టులో జరిగిన ప్రమాదం మరింత ఉత్కంఠ రేపుతోంది. అందులో ఇప్పటివరకు 8 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోదీ కూడా ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. శనివారం ఉదయం ప్రాజెక్టు పనులు చేస్తున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కుప్ప కూలిపోవడంతో ప్రమాదం జరిగింది.
కార్మికులను రక్షించేందుకు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. SLBC ఘటన అనంతరం సీఎం రేవంత్ రాత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రమాదంపై పూర్తి వివరాలు సీఎంకు తెలియజేశారు. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ..ఇక గాయపడ్డ వారికి కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం.
అయితే ఈ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు లోపలికి నడుచుకొని వెళ్లి శిథిలాలను తొలగిస్తూ అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ప్రమాదం జరిగి 24 గంటలు పైగా దాటింది.. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక బురదతో రెస్క్యూ కాస్త అంతరాయం కలిగింది. మోకాళ్ల లోతు నీళ్లు కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రంగంలోకి ఆర్మీ దిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 23 మంది తో కూడిన టీం ఘటన స్థలానికి ఇప్పటికే చేరుకుంది.. ఇక SLBC లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. భారీగా బురద శిథిలాలు ఉండటంతో రెస్క్యూ తీవ్రంగా ఆటంకం కలుగుతుంది.
మందు బాబులకు బిగ్ షాక్.. ఈ నెలలో 2 రోజులు వైన్‌షాపులు బంద్..
ఇక 8 మంది కార్మికులను రక్షించేందుకు తీవ్ర కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు లోపలికి వెళ్లిన తర్వాత టన్నేళ్లలో బోరింగ్ మిషన్ ఆన్ చేశారు. ఒకవైపు నీరు లీక్ కావడంతో మట్టి కుంగింది. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో కార్మికులను బయటికి పంపించారు. టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన మరింత పెరుగుతోంది. ఇప్పటికే 24 గంటలు సమయం కూడా గడిచిపోయింది. ఎనిమిది మంది అక్కడే చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకోవడంతో వారికి ఆక్సిజన్ అందుతుందా ?లేదా? అనేది కీలకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ నిన్న ఫోన్ చేశారు. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అన్ని విధాల సాయం చేస్తామని భరోసా ఇచ్చారు..
వామ్మో అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్ రూ.397కే.. ఇంత వరకు ఏ కంపెనీ ఇవ్వని వ్యాలిడిటీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.