Secunderabad Agnipath Violent Protests: 'అగ్నిపథ్' నిరసనల పేరిట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న విధ్వంసకాండకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారానే ప్లాన్ జరిగినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్' అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. దీనికి అనుబంధంగా మరో 3 వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసినట్లు నిర్ధారించారు.ఈ వాట్సాప్ గ్రూప్స్‌ను క్రియేట్ చేసినవారితో పాటు ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను గుర్తించారు.
ఆ గ్రూప్ క్రియేట్ చేసింది అతనే :
'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్' వాట్సాప్ గ్రూపును శ్రీను అనే ఆర్మీ అభ్యర్థి క్రియేట్ చేశాడు. కరీంనగర్‌కి చెందిన అతను దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 15న మధ్యాహ్నం 1.58 గంటలకు ఈ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూపుకు 8 మందిని అడ్మిన్లుగా చేశాడు. దాదాపు 400 మంది ఇందులో సభ్యులుగా చేరారు. గ్రూప్ క్రియేట్ చేసిన శ్రీను..ఆ తర్వాత ఇందులో నుంచి లెఫ్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
కర్రలు, జెండాలు, రాళ్లు తెచ్చింది అతనే :
'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్' గ్రూపులో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు గురువారం రాత్రి అంతా సికింద్రాబాద్ చేరుకొని వేర్వేరు చోట్ల బస చేయాలని నిర్ణయించుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఆదిలాబాద్‌కి చెందిన ఆర్మీ అభ్యర్థి సాబేర్ జెండాలు, కర్రలు, రాళ్లు తీసుకొచ్చాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న ఆర్మీ అభ్యర్థులందరికీ వాటిని అందజేశాడు. ప్రస్తుతం శ్రీను, సాబేర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
రెచ్చగొట్టింది ఎవరంటే :
'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్' గ్రూపులో ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టింది మల్కాజ్‌గిరికి చెందిన రాజా సురేంద్రగా పోలీసులు గుర్తించారు. నిరసన ప్రదర్శనకు వచ్చేవారంతా టైర్లు, పాత దుస్తులు వంటివి తీసుకురావాలని మెసేజ్‌లు పోస్ట్ చేశాడు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేముందు ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టింది, ప్లాట్‌ఫామ్‌పై రైళ్ల ఏసీ బోగీలు పగలగొట్టింది అతడేనని పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్‌కి చెందిన పృథ్వీరాజ్, కామారెడ్డికి చెందిన సంతోష్ రైలు బోగీలకు నిప్పంటించినవారిలో కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు.
Also Read: Horoscope Today June 20th: నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
Also Read: Etela Meet to Amith shah: అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ..త్వరలో కీలక పార్టీ పదవి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook