Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు సవాళ్లు.. ప్రతి సవాళ్ల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి.బీఆర్‌ఎస్, బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. పన్నెండేళ్ల నరేంద్ర మోడీ పాలన, పదేళ్ల బీఆరెస్ పాలన, పన్నెండు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి.. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో రండి..చర్చకు సిద్ధంగా ఉన్నానని బస్తీ మే సవాల్ అంటూ తొడగొడుతున్నారు. డేట్..ప్లేస్ మీరు చెప్పినా ఓకే అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో మేం పోటీ చేయమని..డబుల్ బెడ్ రూమ్ ఉన్న గ్రామాల్లోనే బీఆర్‌ఎస్ పోటీ చేయాలన్నారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు.. అలాంటి వారికి మీరు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధామా అని హరీష్‌రావు సవాల్ చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రెడీ అని..బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్..బీజేపీ నుండి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నీ కొడంగల్ నియోజకవర్గమైనా, నీ ఇంటికైనా సరే తప్పకుండా చర్చకు వస్తానని హరీష్‌రావు ట్వీట్ చేశారు. కక్షపూరితంగానే మాజీ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.అటు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా రేవంత్ సవాల్ పై స్పందించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.