152 మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తు పూర్తి వివరాలు మీకోసం

మెడికల్ గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం. మెడికల్ ఆఫీసర్ (డాక్టర్), స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 14, 2020, 04:31 PM IST
152 మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తు పూర్తి వివరాలు మీకోసం

హైదరాబాద్:  తెలంగాణలోని మెడికల్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్య, ఆరోగ్య శాఖలోని పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖల ముఖ్యకార్యదర్శి శాంతికుమారి 152 పోస్టుల భర్తీకి గురువారం (ఫిబ్రవరి 13న) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టారు. గడువు ముగిస్తే ఉద్యోగ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఉన్న బస్తీ దవాఖానాలను 118 నుంచి 350కి పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) 94 పోస్టులు, స్టాఫ్ నర్సు 58 పోస్టులను త్వరితగతిన  భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 

అర్హ‌త‌: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌ డిగ్రీతో పాటు అనుభవం. స్టాఫ్ నర్సు పోస్టులకు జీఎన్ఎం లేక బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. ఒకవేళ రెండు క్వాలిఫికేషన్ ఉంటే అత్యధిక మార్కులను వెయిటేజీగా పరిగణిస్తారు. కౌన్సిల్ రిజిస్టేషన్ ఉండటం ఉత్తమం. 

వయసు: జులై 1, 2020 నాటికి పోస్టులను బట్టి 18 నుంచి 34 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు.
జీతం: మెడికల్ ఆఫీసర్‌కు రూ.42,000, స్టాఫ్ నర్సులకు రూ.21000 చొప్పున నెలవారీ జీతం అందుకుంటారు. 

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్

గడువు: 24-02-2020 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌ మార్కులు, వ‌య‌సు, ఎడ్యూకేషన్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని నింపాలి. అప్లికేషన్ ఫారంతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లను ఈ కింది చిరునామాకు ఫిబ్రవరి 24 సాయంత్రం 5గంటల్లోగా అందేలా దరఖాస్తును పంపించాలి. నేరుగా వెళ్లి కూడా దరఖాస్తు అందజేయవచ్చు.

మరిన్ని ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి

ట్రాన్స్‌కోలో చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులు

చిరునామా: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాల‌యం, నాలుగో అంత‌స్తు, ఎన్‌టీపీసీ బిల్డింగ్‌, ప్యాట్నీ, సికింద్రాబాద్‌, హైద‌రాబాద్ జిల్లా.

To Address:
District Medical & Health Officer, Hyderabad District, 4th floor, NTPC Building, Patny, Secunderabad.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News