ఆ బాధ్యత ఎంఎల్ఏలదే : సీఎం కేసీఆర్

ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటాయని, వాటిని అధిగమించి ప్రగతికాముకంగా ముందుకు సాగాలని నేడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీ, కార్పొరేషన్ శాఖల అధికారుల సమావేశంలోమాట్లాడుతూ.. 

Last Updated : Feb 23, 2020, 03:59 PM IST
ఆ బాధ్యత ఎంఎల్ఏలదే : సీఎం కేసీఆర్

హైదరాబాద్: ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటాయని, వాటిని అధిగమించి ప్రగతికాముకంగా ముందుకు సాగాలని నేడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీ, కార్పొరేషన్ శాఖల అధికారుల సమావేశంలోమాట్లాడుతూ..  ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదని, మనందరమూ విజయం సాధించాలని, మన పట్టణాలను మనమే మార్చుకోవాలని అన్నారు. 

తెలంగాణలోని అన్నీ పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలపై, కార్పొరేటర్ల పైనే ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి, పురోగతిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు.

మరోవైపు ఈనెల 21న, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆలయ ఈవో, పూజారులు అందజేశారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News