KTR To Inaugurate Double Bed Room Houses In Hyderabad: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 50వేల భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల దిశగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.
Also Read: Gold Price Today: మిశ్రమంగా బంగారం ధరలు.. వెండి ధరలు పైపైకి!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (Double Bed Room Houses)ను ప్రారంభిస్తారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్‌బీనగర్ నియోజకవర్గం, వనస్థలిపురం రైతు బజార్ వద్ద రెండు ఎకరాల స్థలంలో రూ.28.02 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు.
Also Read: Renu Desai: నిహారిక పెళ్లికి ఆహ్వానం అందలేదా.. రేణు దేశాయ్ క్లారిటీ
మూడు బ్లాక్‌ల్లో మొత్తం తొమ్మిది అంతస్తులలో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. వీటిలో గతంలో అక్కడ నివాసం ఉండే 188 కుటుంబాలకు ఇళ్లను కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకూ 30 వేల ఇళ్లను టీఆర్ఎస్ సర్కార్ నిర్మించింది. దశలవారీగా ఇళ్ల పంపిణీని చేపడుతున్నారు. నేడు జరగనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు పాల్గొననున్నారు.
Also Read: Worlds Shortest Woman Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు
Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe