BRS Vikarabad Meeting: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో మంచినీటి కష్టాలను తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అలాంటి వ్యక్తిని పట్టుకుని రాక్షసానందం, పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మంచి నీటి యుద్ధాలను సీఎం కేసీఆర్ ఆపారని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేశాయని నిలదీశారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చామన్నారు. వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఎన్నికల్లో పోటీ అంటే సముజ్జీలతో ఉంటుందన్న కేటీఆర్.. రాజకీయ మరగుజ్జుగాళ్లతో కాదన్నారు. కేసీఆర్ ముందు వీళ్లు అందరూ రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు అని ఎద్దేవా చేశారు. గతంలో డిగ్రీ కాలేజీ కోసం యుద్ధం చేసిన వికారాబాద్‌లో నేడు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసి.. ఎన్నో దశాబ్దాల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారని అన్నారు. ఎప్పుడు తమ కళ్ల ముందు ఉంటే ఎమ్మెల్యేను ప్రజలు ఎప్పుడూ వదులుకోరని.. హైదరాబాద్‌లో ఉండే ఎమ్మెల్యేను కోరుకోరని కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం పోటీ వ్యక్తుల మధ్య కాదని.. పార్టీల మధ్యే నెలకొందన్నారు కేటీఆర్. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్ వస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో తెలియదన్నారు. ఎవరి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లే.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు దిగుతారని.. ఊదరగొట్టే ఉపన్యాసాలతో ఓట్లు అడుగుతారని అన్నారు. చందమామను తీసుకొచ్చి వికారాబాద్‌లోనే.. అనంతగిరి గుట్ట మీదనే కట్టేస్తామని చెబుతారని ఎద్దేవా చేశారు. ఆగం కాకుండా.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
కర్ణాటకలో ఏదో పొడిచినట్లు కాంగ్రెస్ నేతలు ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారని.. ఆ పార్టీకి ఎందుకు ఓటు వేశామా..? అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశంలో టాప్‌లో ఉందన్నారు. ఈ విషయం ఆర్‌బీఐ చెబుతోందని.. 3 లక్షల 17 వేలతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చన్నారు. బీజేపీ 27 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా..? అక్కడ ఎందుకు అయితలేదని నిలదీశారు.
Also Read: సెంచరీల మోత మోగించిన కాన్వే, రచిన్.. ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం..
Also Read: Breaking: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. లోక్ పోల్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook