Lok Sabha Speaker Phone Call to MP Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా శుక్రవారం (జనవరి 28) ఫోన్ చేశారు. ఇటీవల ఆర్మూర్‌లో అరవింద్‌పై జరిగిన దాడి వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసుల సహకారంతో తనపై హత్యాయత్నం జరిగిందని ఈ సందర్భంగా అరవింద్ (MP Arvind) స్పీకర్‌తో చెప్పారు. ఎంపీ అరవింద్ చెప్పిన విషయాలు విన్న స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా.. వెంటనే ఆయన్ను ఢిల్లీకి రావాలన్నారు. దీంతో మరో రెండు రోజుల్లో ఎంపీ అరవింద్ ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఆర్మూర్ పర్యటనలో ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి :
ఇటీవల నిజామాబాద్ జిల్లా (Nizamabad) ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండల పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎంపీ అరవింద్ వెళ్లారు. అయితే మార్గమధ్యలోనే ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. పసుపు బోర్డు హామీ నెరవేర్చనందుకు రైతులే దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ చెబుతుండగా... టీఆర్ఎస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఎంపీ అరవింద్ (MP Arvind), బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తనపై హత్యాయత్నానికి టీఆర్ఎస్ కుట్ర పన్నిందని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్ బిర్లా ఎంపీ అరవింద్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అటు గవర్నర్ తమిళిసై సైతం అరవింద్‌తో ఫోన్‌లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు.
అప్పుడు కూడా వెంటనే స్పందించిన స్పీకర్ :
ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ని సవరించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు దీక్షకు అనుమతి లేదని చెబుతూ.. ఆయన కార్యాలయంలోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టి మరీ సంజయ్‌ని (Bandi Sanjay) అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలోనూ లోక్‌సభ స్పీకర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. తెలంగాణ డీజీపీ, కరీంనగర్ సీపీలకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీ విచారణ కొనసాగుతోంది.
Also Read: Crime inspired by Drishyam: 'దృశ్యం' స్టైల్లో క్రైమ్‌కి స్కెచ్, అడ్డంగా దొరికిపోయారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook