Eco-friendly: ఈకో ఫ్రెండ్లీ గణేష్‌ని వేటితో తయారు చేశారో కనుక్కోండి

Eco-friendly: వినాయక చవితి వచ్చిందంటే చాలు..బొజ్జ గణపతి వివిధ రూపాల్లోనే కాదు..వివిధ రకాలుగా రూపుదిద్దుకుంటాడు. ఇటీవల ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలు ఎక్కువౌతున్నాయి. హైదరాబాద్‌లో కొలువుదీరిన వినాయకుడని దేనితో తయారుచేశారో వింటే ఆశ్చర్యపోతారు  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 3, 2022, 04:46 PM IST
Eco-friendly: ఈకో ఫ్రెండ్లీ గణేష్‌ని వేటితో తయారు చేశారో కనుక్కోండి

Eco-friendly: వినాయక చవితి వచ్చిందంటే చాలు..బొజ్జ గణపతి వివిధ రూపాల్లోనే కాదు..వివిధ రకాలుగా రూపుదిద్దుకుంటాడు. ఇటీవల ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలు ఎక్కువౌతున్నాయి. హైదరాబాద్‌లో కొలువుదీరిన వినాయకుడని దేనితో తయారుచేశారో వింటే ఆశ్చర్యపోతారు...

వినాయక చవితి సందర్భంగా అంగుళాల సైజు నుంచి భారీగా 40 అడుగుల వినాయకుడి విగ్రహాలు తయారవుతుంటాయి. ఇంకొన్ని ఈకో ఫ్రెండ్లీ పేరుతో విభిన్న రూపాల్లో దర్శనమిస్తుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కో రూపంలో..వివిధ పద్ధతుల్లో తయారు చేస్తుంటారు. గణపతిని దేనితో తయారు చేస్తారనేది కూడా చాలా ముఖ్యం. హైదరాబాద్‌లో ఈసారి కొత్తగా కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేశారు. ఇదిప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 

కేరళ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ ఆర్టిస్ట్ కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేశాడు. దాదాపు 17 వేల కొబ్బరికాయల్ని ఇందులో వినియోగించాడు. హైదరాబాద్ ప్రజల్ని ఈ కొబ్బరి వినాయకుడు విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాల తయారీకు చెక్ పెట్టాలని ఆ ఆర్టిస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈకో ఫ్రెండ్లీ వినాయకులతో పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతున్నాడు.

కొబ్బరికాయలో ప్రతి ఒక్కరికి వివిధ రకాలుగా కనెక్షన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో వినియోగిస్తుంటారు. అందుకే కొబ్బరి కాయలతో వినాయకుడిని తయారు చేశారు. 17 వేల కొబ్బరి కాయలతో ఈ వినాయకుడిని తయారు చేసేందుకు 8 రోజులు పట్టింది. కొబ్బరికాయలతో కొలువుదీరిన కొబ్బరి వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశమయ్యాడు. చుట్టుపక్కల ప్రాంతాల్నించి పెద్దఎత్తున జనం వచ్చి దర్శించుకుంటున్నారు. 

Also read: Photo War: తెలంగాణలో ముదిరిన ఫోటో వార్.. వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలనే డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News