Telangana State Secretariat Temples: డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మించిన హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన మూడు ప్రార్థనా మందిరాలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. చండీయాగం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. అదే సందర్భంలో ఆలయ ప్రాంగణంలలోని అనుబంధంగా ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన చర్చికి, గవర్నర్‌ను తీసుకుని సీఎం కేసీఆర్ వెళ్లారు. క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మత పెద్దలు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. అనంతరం పక్కనే నిర్మించిన మసీదులో సాంప్రదాయ పద్ధతిలో మత పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది చాలా సంతోషకరమైన సమయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుందని చెప్పారు. లౌకికత్వాన్ని చాటేలా ఆలయాలు, మసీదులు, చర్చిలు వెలియాలని అన్నారు. ఈ మూడు ఒక్కచోట ఉన్న ప్రదేశానికి ఉత్తమ నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిలుస్తుందన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కలిసిమెలిసి ముందుకు సాగుతూ.. ప్రార్థనలు చేసుకొంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారని అన్నారు.
"యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధమైన సహృద్భావ పరిస్థితులు సదా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఎల్లవేళలా శాంతి నెలకొని ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను." అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అనంతరం సెక్రటేరియట్ భవనాన్ని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ చూపించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్‌కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ.. సీఎం కేసీఆర్ తన ఛాంబర్‌కు తీసుకువెళ్లారు. శాలువాతో సత్కరించి పూల బోకెను అందించారు. అనంతరం హై‘టీ’తో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఏర్పాటు చేసిన అధునాతన మౌలిక వసతుల వివరాలను గవర్నర్ సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉందని కొనియాడారు.
Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook