CM KCR Birthday: 68వ వసంతంలోకి కేసీఆర్, ఘనంగా తెలంగాణ సీఎం జన్మదిన వేడుకలు!

KCR 68th Birthday: ఈ సారి సీఎం కేసీఆర్ బర్త్‌ డే వేడుకులు తెలంగాణ అంతటా అంబరాన్ని అంటాయి. నేడు సీఎం కేసీఆర్‌ 68వ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రం అంతా టీఆర్ఎస్‌ శ్రేణులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 11:15 AM IST
  • ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు
  • మూడు రోజులుగా కొనసాగుతోన్న సీఎం బర్త్‌డే సెలబ్రేషన్స్
  • పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతోన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
  • పలు రాష్ట్రాల్లో..దేశాల్లోనూ కేసీఆర్‌‌ జన్మదిన వేడుకలు
CM KCR Birthday: 68వ వసంతంలోకి కేసీఆర్, ఘనంగా తెలంగాణ సీఎం జన్మదిన వేడుకలు!

KCR Birthday Celebrations: తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు పోరాడిన యోధుడిగా సీఎం కేసీఆర్‌ను పొగుడుతోంది తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో పాటు ఆయన చేపట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటోంది తెలంగాణ సమాజం. తెలంగాణ కోసం అవిశ్రాంతగా పోరాటం చేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) జన్మదినం ఈరోజే.

ఆమరణ నిరాహార దీక్ష సమయంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినా కూడా తెలంగాణ సాధన కోసం పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడారు. తాను మరణించినా ఫర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు అనుకుని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తన మరణంతోనైనా సరే.. తెలంగాణ వస్తే చాలనుకున్నానని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ సచ్చుడో లేదంటే తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్‌‌ చేపట్టిన దీక్షకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత చాలా ఆటుపోట్లు ఎదురైనా కూడా నాలుగున్నర సంవత్సరాలకు తెలంగాణ కల సాకారమైంది. అలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు సాధించి పెట్టి.. ఎన్నికల్లో ప్రజా తీర్పుతో ఏడేళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై కేసీఆర్ కూర్చొంటున్నారు.

సీఎం కేసీఆర్ ఈ రోజు (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 15 నుంచే తెలంగాణ వ్యాప్తంగా మొదలైన కేసీఆర్ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. నేడు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ అంతటా సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. అలాగే అంతటా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంతేకాక టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. 

సీఎం కేసీఆర్ బర్త్‌ డే సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ ఒడిశా పూరీ బీచ్‌లో కేసీఆర్ భారీ సైకత శిల్పాన్ని రూపొందించాడు. కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని నిన్న పెద్ద ఎత్తున రక్తదానాలు కొనసాగాయి. మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు నేతలు రక్తదానం చేశారు. రాష్ట్ర మంతటా రక్తదాన శిబిరాలు కొనసాగాయి. ఇక సీఎం జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా ఆవిష్కరించారు.

 

ఈ సారి కేసీఆర్‌ బర్త్‌ డే వేడుకల్ని మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో.. పలు దేశాల్లోనూ కేసీఆర్‌‌ జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని తెలంగాణ ప్రజానీకం కోరుకోంటోంది.

Also Read: Raja Singh: యూపీ ఓటర్లను బెదిరించారని... బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు EC నోటీసులు

Also Read: CM KCR Birthday: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. రక్తదానం చేసిన మంత్రి హరీష్ రావు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News