Himanshu Rao First Vote: లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కు వయసు ఎప్పుడో వచ్చినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో విదేశాలలో ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్న హిమాన్షు తొలిసారి తన ఓటును వేశాడు.
Also Read: Madhavi Latha: ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ సంచలనం.. నఖాబ్ ఓపెన్ చేసి చెక్ చేసిన మాధవీలత..
బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ సెంటర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా చుక్కను ముగ్గురు చూపించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై హిమాన్షు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హిమాన్షు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు.
'తొలిసారి ఓటు వేశాను. అతిపెద్ద బాధ్యతను పూర్తిచేసినట్లు భావిస్తున్నా. అందరూ వెళ్లి ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని బలంగా.. స్పష్టంగా చెప్పండి' అని హిమాన్షు 'ఎక్స్'లో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా కుటుంబంతో ఓటు వేసిన ఫొటోలను పంచుకున్నాడు. హిమాన్షు తండ్రి కేటీఆర్ హైదరాబాద్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ వచ్చి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సూచించారు. 'మంచి ప్రభుత్వాలు, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిథ్యం వహించే వారికి ఓటు వేయాలి' అని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
Voted for the first time, felt like a huge responsibility is fulfilled.
Please do vote and voice your opinion loud and clear🙏🏼 pic.twitter.com/jOsu2zpJ4q
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) May 13, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter