Hyderabad: గణేష్ నిమజ్జన వేళ హైటెన్షన్.. రేపు హైదరబాద్ వ్యాప్తంగా ఆందోళనలు.?.. కారణం ఏంటంటే..?

Ganesh immersion issue in Hyderabad: హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద  వినాయక నిమజ్జనం లేదంటూ అధికారులు ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేశారు.దీనిపై భాగ్య నగర్ ఉత్సవ సమితి మండిపడింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Sep 15, 2024, 02:06 PM IST
  • రేవంత్ సర్కారు కు ధమ్కీ ఇచ్చిన భాగ్యనగర్ ఉత్సవ సమితి..
  • వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్..
Hyderabad: గణేష్ నిమజ్జన వేళ హైటెన్షన్.. రేపు హైదరబాద్ వ్యాప్తంగా ఆందోళనలు.?.. కారణం ఏంటంటే..?

Bhagyanagar ganesh utsav Samithi warning to revanth govt: దేశవ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాలు  ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ, పల్లె, పట్నం అని తేడా లేకుండా గణేష్ ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటున్నారు. ప్రతిచోట ప్రత్యేకండ పాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తితో కొలుచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ట్యాంక్ బండ్ లో జరిగే వినాయక చవితి వేడుకల్ని చూసేందుకు  భక్తులు ఎక్కడి నుంచి భారీగా తరలివస్తుంటారు.

 

ఈ క్రమంలో.. పోలీసులు కూడా గట్టిగానే బందోబస్తు సైతం నిర్వహింస్తుంటారు.అంతేకాకుండా.. ఈసారి వరుస సెలవులు కూడా రావడంతో.. భక్తులు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడాహైదరబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరబాద్ లోని ట్యాంక్ బండ్ లో వినాయకుడి పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయోద్దంటూ కూడా అధికారులు అనేక ఫ్లెక్సీలను ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు.అంతేకాకుండా.. ఇనుప బారీకెడ్లను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భాగ్య నగర ఉత్సవ సమితీ దీనిపై సీరియస్ అయ్యింది.

పూర్తివివరాలు..

హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయోద్దంటూ కూడా పోలీసులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. బారికెడ్లను సైతం ఏర్పాటు చేశారు. దీంతో భాగ్యనగర  ఉత్సవ సమితి అక్కడకు చేరుకున్నారు. ప్రతి ఏడాది హైదరబాద్ లోని ట్యాంక్ బండ్ మీద గణేష్ నిమజ్జనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ మీద వెలిసిన బారికెడ్లను, బ్యానర్ లను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న భాగ్యనగర ఉత్సవసమితి అక్కడి బ్యానర్ లను, బారికెట్లను పక్కకు తోసేశారు.

ఎన్నోఏళ్లనుంచి ఇక్కడ నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కానీ ఈసారి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకూడదంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అంతేకాకాకుండా..  భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదన్నారు. గతంలో కూడా గణేష్ నిమజ్జనం అనేక ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నించారన్నారు. తాము.. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తున్నామని, ఈసారి కూడా ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామని కూడా భాగ్యనగర్ ఉత్సవసమితి సభ్యులు  తెల్చి చెప్పారు.

Read more: Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా.. సంచలన ప్రకటన చేసిన అరవింద్ కేజ్రీవాల్..

వెంటనే సర్కారు నిమజ్జనానికి ప్రతి ఏడాది మాదిరిగానే అన్నిరకాలుగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే.. రేపు హైదరాబాద్ అంతటా ఆందోళన చేపట్టి తమ తడాఖా చూపిస్తామని కూడా వెల్లడించారు.  ముఖ్యంగా..  రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తామని.. వార్నింగ్ సైతం ఇచ్చారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News