Tecno Spark 20 Pro: దేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇటీవలి కాలంలో గణనీయంగా వాటా పెంచుకుంటున్న కంపెనీ టెక్నో. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దిమ్మ తిరిగే ఫీచర్లతో అతి తక్కువ ధరలో మరో ఫోన్ లాంచ్ చేసింది.
ప్రముఖ టెక్ కంపెనీ Tecno కొత్తగా Tecno Spark 20 Pro లాంచ్ చేసింది. మొన్న జూన్ 23 నుంచి ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ వేదికగా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ప్రోసెసర్ ఉంది. ఈ ప్రోసెసర్ మాలీ జీ57 ఎంసీ 2 జీపీయూతో అనుసంధానితమైంది. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంటుంది. Tecno Spark 20 Pro ఆండ్రాయిడ్ 14 ధారంగా పనిచేస్తుంది. ఇందులో సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విభాగాలు మూడున్నాయి. కెమేరా, ర్యామ్, స్టోరేజ్ మూడూ అద్భుతంగా ఉండటంతో కచ్చితంగా మార్కెట్లో సందడి చేయవచ్చు.
అద్భుతమైన రిజల్యూషన్ కెమేరా, పనితీరు వేగంగా ఉండే ఫోన్ కావాలంటే ఇదె బెస్ట్ ఆప్షన్. ఇందులో ర్యామ్ ఏకంగా 16 జీబీ వరకూ ఉంటుంది. అంటే ఫోన్ పని తీరు వేగంగా ఉంటుంది. ఇక స్టోరేజ్ 256 జీబీ సామర్ధ్యంతో ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రస్తుతం రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక కెమేరా గురించి పరిశీలిస్తే ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. 1.8 ఎపర్చర్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇది కాకుండా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.
Tecno Spark 20 Pro స్మార్ట్ ఫోన్ 3 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 15,999 రూపాయలకు లబిస్తంది. 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 16,999 రూపాయలుగా ఉంది. ఎర్లీ సేల్ లో భాగంగా వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డు ఆఫర్లు ఉన్నాయి. దాంతో ఈ ఫోన్ కేవలం 13,999 రూపాయలకే లభించనుంది.
Also read: Cheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook