Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్‌లో ఈ బైక్‌ ఎంత మందికి తెలుసు? దీని ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!

Royal Enfield Guerrilla 450 Price: గతంలో మార్కెట్‌లోకి విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 మోటర్‌సైకిల్‌ ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2025, 06:59 PM IST
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్‌లో ఈ బైక్‌ ఎంత మందికి తెలుసు? దీని ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!

Royal Enfield Guerrilla 450 Price: ప్రముఖ మోటర్‌సైకిల్‌ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్‌లోకి గత ఏడాది నుంచి అద్భుతమైన బైక్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే అద్భుతమైన బైక్స్‌ను లాంచ్‌ చేస్తోంది. గత ఏడాదిలో విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450)మోటర్‌సైకిల్ అద్భుతమైన స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 452cc ఇంజన్‌తో విడుదలైంది. అయితే ఈ మోటర్‌సైకిల్ మార్కెట్‌లో సేల్స్‌ పరంగా మాత్రం కాస్త తక్కువేనని సమాచారం. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450) మోటర్‌సైకిల్ ఎంతో శక్తివంతమైన  452cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే  డ్యూయల్-ఛానల్ ABS భద్రత ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా గెరిల్లా 450 మోటర్‌సైకిల్ లీటరుకు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది. ఈ బైక్‌తో కేవలం  15.3-లీటర్ ఇంధన ట్యాంక్‌ను మాత్రమే అందిస్తోంది. 

ఈ మోటర్‌సైకిల్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అధునాతన  డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఎంతో ప్రత్యేమైన స్పీడోమీటర్, ఓడోమీటర్‌తో పాటు ట్రిప్ మీటర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ బైక్‌ డిజైన్‌  సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో డబుల్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో ఈ మోటర్‌సైకిల్‌ అందుబాటులో ఉంది. 

Read more: CM Revanth Reddy: రంజాన్ వేళ ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450) బైక్‌ సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది ధర రూ.2.80 లక్షలతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మీరు కూడా ఈ మోటర్‌ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటుతోనే EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయోచ్చు. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి  రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Read more: CM Revanth Reddy: రంజాన్ వేళ ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News