Infinix Note 30 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై హాట్ డీల్ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా Infinix కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Note 30 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే Infinix Note 30 5G మొబైల్‌పై ఇతర బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవేంటో, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఫీచర్లు, ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix Note 30 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్ ధర రూ.19,999తో విక్రయిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ రూ.15,999కే అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు Infinix Note 30 5Gను SBI బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
దీంతో పాటు మీరు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ రూ. 699కే సంవత్సరం పాటు Spotify Premiumను అందిస్తోంది. దీంతో పాటు మీరు 6 నెలల పాటు రూ.2667 చెల్లించి, నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. మీరు ఈ స్మార్ట్‌ఫోన్ అదనపు తగ్గింపుతో పొందడానికి ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.10,099 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు Infinix Note 30 5G స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఆఫర్స్ పోను రూ.5,900కే పొందవచ్చు.
Infinix Note 30 5G స్పెషిఫికేషన్స్, ఫీచర్స్:
6.78 అంగుళాలు డిస్ప్లే
1080 x 2460 పిక్సెల్‌లు
డ్యూయల్ సిమ్ సెటప్
ఆండ్రాయిడ్ 13 OS
Mediatek డైమెన్సిటీ 6080 చిప్సెట్
ఆక్టా-కోర్ CPU, మాలి-G57 MC2 GPU
108 MP ట్రిపుల్ కెమెరా కెమెరా
16 MP సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Li-Po 5000 mAh బ్యాటరీ
45W వైర్డ్ ఛార్జింగ్
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి