Hero Hf Deluxe On Road Price In Hyderabad: ప్రముఖ మోటర్ సైకిల్ తయారీ కంపెనీ హీరో విడుదల చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్స్‌కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. మిడిల్ క్లాస్ బడ్జెట్లో వచ్చే బైక్స్‌లో ఇది ఒకటి.. ఈ బైక్ అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో జీవించేవారికి ఈ మోటర్‌సైకిల్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. అయితే హీరో కంపెనీ ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్స్ ఎప్పటికప్పుడూ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఈ మోటర్‌సైకిల్ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన అప్డేట్ వేరియంట్స్‌లో లాంచ్ అవుతూ వస్తోంది. ఇటీవలే విడుదలైన హీరో HF డీలక్స్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హీరో HF డీలక్స్ మిడిల్రేంజ్ 97.2cc ఇంజన్‌తో విడుదలైంది. దీని ఇంజన్ 8.05 Nm టార్క్‌తో పాటు 6.1 kW శక్తిని ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే గత మోటర్‌సైకిల్ కంపెనీ ఇందులో అద్భుతమైన భద్రతా ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ప్రత్యేకమైన సీట్స్‌తో పాటు అద్భుతమైన సస్పెన్షన్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో హీరో కంపెనీ ట్యూబ్‌లెస్ టైర్లను కూడా అందిస్తోంది. అలాగే భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇంజన్‌కు స్పెషల్ కట్-ఆఫ్ మెకానిజంను కూడా అందిస్తూ వస్తోంది.
ఇక ఈ కొత్త హీరో HF డీలక్స్‌కి సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే.. దీని మైలేజీ 60 నుంచి 70 కి.మీ మధ్య ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తక్కువ కాస్ట్‌లోనే ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకునేవారికి ఈ మోటర్‌సైకిల్ బాగా సెటప్ అవుతుంది. ఇది కార్బ్యురేటర్ ఆధారిత ఇంజన్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ఎంత దూరం ప్రయాణం చేసిన.. ఏ మాత్రం అలసట అనిపించదు. అలాగే ఇది స్పెషల్ సీటింగ్ డిజైన్‌తో వస్తోంది. కాబట్టి ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణం చేయోచ్చు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ఇక ఈ మోటర్‌సైకిల్ ధర వివరాల్లోకి వెళితే.. ఇది సుమారు రూ. 50,000 (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఈ రేటు ప్రాంతాలను బట్టి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మరింత తగ్గింపు ధరకే రావచ్చు. కొన్ని చోట్ల ఎక్కువ ధరకు రావచ్చు. అంతేకాకుండా హీరో కంపెనీ ఈ హీరో HF డీలక్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి