ఆపిల్ యూజర్లకు అదిరిపోయే న్యూస్-త్వరలో మార్కెట్లోకి ఐఫోన్ 15 సిరీస్

మొబైల్ కంపెనీలలో ఆపిల్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఫోన్ విడుదల చేయబోయే కొత్త సీరీస్ ల గురించి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాగే కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 15 సీరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2023, 06:47 PM IST
ఆపిల్ యూజర్లకు అదిరిపోయే న్యూస్-త్వరలో మార్కెట్లోకి ఐఫోన్ 15 సిరీస్

Iphone 15 Launch Date: ఆపిల్ ప్రాడక్ట్ లకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఆపిల్ నుండి వచ్చే ప్రతి ప్రాడక్ట్ ల కోసం జనాలు ఎదురుచూస్తుంటారు. ముఖ్యముగా ఆపిల్ ఐఫోన్ గురించి చెప్పనక్కర్లేదు. లాంచ్ చేసిన కాసేపటికే వేలకొద్దీ ఫోన్లు అమ్ముడవుతుంటాయి. ఇక రాబోయే ఐఫోన్ 15 సీరీస్ కోసం అయితే జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ యూజర్లకు ఆపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. 

త్వరలో మార్కెట్లోకి ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 13న ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా, ఆపిల్ సంస్థ తన ఐఫోన్‌లను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఈ ఏడాది ఆపిల్ ఐఫోన్ 15ని సెప్టెంబర్ 13న లాంచ్ చేయాలని యోచిస్తోంది. 

వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15, అంటే శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 22న యూజర్లు కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ మోడల్స్ కంటే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లు కొంచెం వంగిన టైటానియం ఫ్రేమ్, థిన్-బెజెల్ డిస్‌ప్లేలు, శక్తివంతమైన 3ఎన్ ఎం ఏ17 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంటాయని, అంతేకాకుండా 8 జీబీ రామ్ ని అందించే మొదటి ఐఫోన్లు అవుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Also Read: Poco F5 5G Price: డెడ్‌ ఛీప్‌గా 5G స్మార్ట్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?  POCO F5 5G రూ. 1,600లకే..

అదేవిధంగా బేస్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కూడా డైనమిక్ ఐలాండ్‌తో కొత్త డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా, ఐఫోన్ 15 సిరీస్‌లోని మొత్తం నాలుగు మోడల్‌లు యూఎస్ బీ టైప్-సి పోర్ట్‌ను ఉంచేందుకు సెట్ చేయబడ్డాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ కొంచెం ఎక్కువ ధరకు మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ధర ఐఫోన్ 14, 14 ప్లస్‌ల మాదిరిగానే ఉంటుందని అంచనా వేసింది.

Also Read: Top Mileage Cars: కారు కొనాలనుకుంటే..పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టాప్ మైలేజ్ కార్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News