YS Sharmila Questioned CM Chandrababu: వైద్య విద్య ప్రైవేటీకరణ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
YS Sharmila Prays Tribute To His Father YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం, తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. 75 జయంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి అంజలి ఘటించారు.
YS Sharmila Meets Sonia Rahul And Priyanka Gandhi In Delhi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటించారు. పార్టీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతంపై అగ్ర నాయకత్వం షర్మిలకు సూచనలు చేశారు.
YS Sharmila on AP Election Results: రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.
YS Sharmila Fires on PM Modi: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఏపీపై మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పది ప్రశ్నలు సంధించారు.
CM YS Jagan Mohan Vs YS Sharmila: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. న్యాయ నవ సందేహాలు అంటూ ఆమె లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాతనే ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Son Marriage Pics: రాజస్థాన్లోనూ జోధ్పూర్ ప్యాలెస్లో ఘనంగా వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో అట్టహాసంగా జరగ్గా ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాకపోవడం గమనార్హం.
CM Jagan Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో చతికిలబడిన కాంగ్రెస్కు మళ్లీ జీవం పోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే దూకుడు పెంచుతున్నారు. నేరుగా జగన్ను టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్న షర్మిల కాంగ్రెస్కు మరింత ఊపు తెచ్చేందుకు రెండు స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నారు.
APCC President YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక రాష్ట్రంలో అన్న-చెల్లెల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
YS Sharmila Joins in Congress: వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన తండ్రి వైఎస్సార్ కోరిక అని అన్నారు.
YS Sharmila Will Join Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరేందుకు బుధవారం ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరికకు షర్మిల కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మూడు ఆప్షన్లు షర్మిల ముందు ఉంచినట్లు సమాచారం.
Telangana Elections 2023: వైఎస్సార్టీపీ పార్టీకి నాయకులు రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్ను గద్దె దించ అవకాశం వచ్చినందుకు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.
YSRTP Leaders Resigned: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుని కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో వైఎస్ షర్మిలపై సొంతపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహి షర్మిల అని విమర్శలు చేశారు. ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటామని తెలిపారు.
YSRTP Congress Merger: కాంగ్రెస్ పార్టీకి డెడ్లైన్ విధించారు వైఎస్ షర్మిల. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై నిర్ణయం తీసుకోకపోతే.. 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిపోయింది.
YS Sharmila Comments on CM KCR: రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ను నిలదీశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అన్నదాతలు పండించిన పంటను కొనే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.