CycloneJawad Current position : జవాద్ తుపాన్ ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లను తాకే అవకాశం ఉంది. ఈ తుపాన్ దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో..రాయలసీమ, దక్షిణకోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Heavy Rain Alert: Telangana districts to be hit owing to depression in Bay of Bengal : అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో గురువారం రాత్రి, శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather forecast live in telangana: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం నవంబర్ 18న దక్షిణ ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rain in next 48 hours: ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకల నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది.
Heavy rains due to low pressure in Bay of Bengal: జులై 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
Rains in Telangana: హైదరాబాద్: కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే శనివారం తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించేందుకు 24 గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Hyderabad Rains Latest Updates: వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దాంతో ఎండల నుంచి కాస్త ఊరట లభించనుంది.
బురేవి తుఫాన్ (Burevi Cyclone) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
తమిళనాడు (tamil nadu), పుదుచ్చేరి (puducherry) ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నివర్ తుపాను (Nivar Cyclone) తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా (cyclonic storm) మారిందని వాతావరణ శాఖ గురువారం ఉదయం పేర్కొంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదలతో హైదరాబాద్ (Hyderabad Flood) నగరం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ (IMD)వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.