CycloneJawad Current position and Rains will intensify over the coastal areas: జవాద్ తుపాన్ ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లను తాకే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జవాద్ తుపాన్ వాయువ్య దిశలో కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలను దాటనుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాజాగా జవాద్ తుపానుగా (CycloneJawad) మారింది. ఇది గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తోంది. ఇవాళ ఉత్తరాంధ్ర, (Uttarandhra) ఒడిశా (Odisha) తీరాలకు (coastal areas) సమీపంలోకి ఇది వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముంది. ఇక ఒడిశాలోని 19 జిల్లాల్లో పాఠశాలలను మూసి వేశారు.
ఇక ఈ తుపాన్ దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ (odisha puri) వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి ఈ తుపాన్ పూరీకి చేరుకునే అవకాశం ఉంది. తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరంలో ఇవాళ గంటకు 110 కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.
వెదర్ అండ్ రాడర్ ఇండియా ప్రకారం.. CycloneJawad తుపాను ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలో ఉంది. తీరప్రాంతాల్లో వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు రాత్రికల్లా ఈ తుపాను బలహీనపడే అవకాశం ఉంది.
🌀Current position of #CycloneJawad. Rains will intensify over the coastal areas, however the cyclone is likely to weaken in by today night. Stay safe! #CycloneAlert #Cyclone #CycloneUpdate #Odisha https://t.co/T5ajIwkj1B pic.twitter.com/9iznge0AQ2
— Weather & Radar India (@WeatherRadarIN) December 4, 2021
జవాద్ తుపాను కారణంగా శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు సూచనలున్నాయి. దీంతో అక్కడ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
🌀#CycloneAlert: Heavy rains expected along the costal and interior parts of Odisha & northern coastal areas of Andhra Pradesh. West Bengal will also witness rains. Track now live on our app: https://t.co/pwmwDJcGV5#cyclonejawad #cyclone #odisha #andhrapradesh #westbengal pic.twitter.com/Vnr9D5Q3Lm
— Weather & Radar India (@WeatherRadarIN) December 4, 2021
Also Read : సరికొత్త చరిత్ర సృష్టించిన కివీస్ స్పిన్నర్.. మూడో బౌలర్‌గా అరుదైన రికార్డు!!
జవాద్ తుపాన్ ముప్పు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారత నావికా దళాలను రంగంలోకి దించింది. రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నావికాదళాలు ముమ్మరం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) మూడు జిల్లాల నుంచి చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మందిని రెస్క్యూ టీమ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో చాలా వరకు వరద బాధితుల సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది.
Also Read : Omicron: అమెరికాలో వచ్చే వారం నుంచి కఠిన ఆంక్షలు- ఒమిక్రాన్ భయాలే కారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి