BRS Party Filed Petition Against Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా ఎన్నికల సమయంలో తమ పార్టీపై ఇబ్బందులకు గురి చేసేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మతపరమైన చిహ్నాలు, విద్వేష ప్రసంగాలు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది.
KT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
KT Rama Rao Surat Election: అన్యూహంగా సూరత్ లోక్‌సభ ఎన్నిక ఏకగ్రీవం కావడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా సూరత్ ఎంపీగా ఎన్నికవడంపై తీవ్ర విమర్శలు వస్తుండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తప్పుబట్టారు. ఒక దేశం ఎన్నికలు లేవు అంటూ 'ఎక్స్' వేదికగా స్పందించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు అనేవి ఉండవంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వైఫల్యంతోనే సూరత్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని విమర్శించారు.
KTR Big Positive Comments On Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నాయకులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కనున్నాయని పార్టీ నేతలతో పంచుకున్నారు.
Komatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
KCR KTR Jail: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత మాదిరే వాళ్లిద్దరూ కూడా జైలుకు పోతారని చెప్పారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు రాజగోపాల్ రెడ్డి కాదని ప్రకటించారు. అత్యధిక సీట్లు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Congress Akarsh: తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న కూడా రాజీనామా చేశాడు. ఎన్నికల ముందు గులాబీ పార్టీలో చేరిన ఏపూరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు సోమన్న కృతజ్ఞతలు తెలిపారు.
KT Rama Rao Sensational Comments On Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపైనే ప్రత్యారోపణలు చేశారు.
KCR Bus Yatra: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
Manne Krishank Resign To BRS Party Very Soon: రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మన్నె క్రిశాంక్ బీఆర్ఎస్కు రాజీనామా చేయబోతున్నాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Gangula Kamalakar Joining In Congress: బీఆర్ఎస్ పార్టీ మరో భారీ షాక్ తగలనున్నదని సమాచారం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హస్తం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
KT Rama Rao: తెలంగాణలో ఎండలతోపాటు రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. మగాడివైతే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
KT Rama Rao Questioned To Revanth Reddy Hyderabad Water Problem: రేవంత్ రెడ్డిపై మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. దమ్ముంటే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు.
KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
BRS Party Election Plan: అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహంతో దూసుకెళ్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో మరోసారి గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. ఇక మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన తగ్గలేదు.
KT Rama Rao Strong Counter To Revanth Reddy And Eatala Rajender: కేంద్రంలోని బీజేపీని, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల దాడి తీవ్రం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.