Komatireddy Venkat Reddy: శుక్రవారం రాత్రి నల్గొండలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy About Rahul Gandhi's Disqualification: కేంద్రం రాహుల్ గాంధీపై ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు అందరూ రాహుల్ గాంధీకే అండగా ఉంటారు. ఆయనపై అనర్హత వేటు వేయడం అంటే రాజ్యాంగాన్ని, అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుంది. ఇది ముమ్మాటికీ నరేంద్ర మోదీ సర్కారు తొందరపాటు చర్యే అవుతుంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Komatireddy Venkat Reddy Press meet: గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రేతో సమావేశం అనంతరం కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మానిక్ రావు ఠాక్రేకు, తనకు మధ్య జరిగిన సంభాషణ వివరాలు మీడియాకు వెల్లడించారు.
Komatireddy Rajagopal Reddy: సోమవారం ఉదయం సుమారు 11.30 గంటలకుప్రారంభమైన ఆకస్మిక తనిఖీలు రాత్రి 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో లభించిన డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రభుత్వానికి లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కనుగొన్నారు.
Revanth Reddy Birthday Special: రేవంత్ రెడ్డి.. ఈయన్ను తెలంగాణ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటే అది చాలా సింపుల్ అవుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటే అది రొటీన్ అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక పొలిటికల్ స్టార్ అని చెప్పుకుంటే అది అచ్చంగా సూట్ అవుతుంది.
Komatireddy Venkat Reddy:గత నెల 22వ తేదీన కోమటిరెడ్డి కి షోకాస్ నోటీసు పంపింది ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏఐసీసీ ఇచ్చిన గడువు నవంబర్ 1తో ముగిసింది. అయినా ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Komatireddy Venkat Reddy:ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నవంబర్ 7న స్వదేశానికి రానున్నారు. నవంబర్ 2న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన డెడ్‌లైన్ నవంబర్ 2వ తేదీతో ముగుస్తుంది. అంటే పోలింగ్ జరగడానికి ముందే కోమటిరెడ్డి తన వివరణను పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది.
Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయన ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. పార్టీలకు అతీతంతా రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి ఆడియో కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతోంది.
Komatireddy Venkat Reddy:బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన సోదురుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ చేయలాంటూ కాంగ్రెస్ నేతలకు ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ లీకై వైరల్ గా మారింది.ఆ ఘటన మరవకముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన మరో వీడియో బయటికి వచ్చింది
Harish Rao Meeting with Munugode TRS workers: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే రాజీనామా చేశాడని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అంతేకాదు.. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో, ఎందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో రాజగోపాల్ రెడ్డికే తెలియదు అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, తెలంగాణ ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మాట్లాడటానికి ఏమీ లేదని.. ఏం చేసినా చేతలతోనే చేసి బొంద పెడతా అని తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు.
Komati Reddy Audio Leak: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్ చేశారు కోమటిరెడ్డి.
Komatireddy Venkat Reddy Audio Leak: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యాలంటూ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఏమైనా ఉంటే తాను చూసుకుంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో కోమటి రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలని కోరడం ఎంతవరకు సమంజసం అంటూ కోమటిరెడ్డిపై కాంగ్రెస్
KTR slams Komatireddy Rajagopal Reddy: బీజేపీకి గుడ్ బై చెప్పిన బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
Budida Bikshamaiah Goud Joins TRS: కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీరి పనిచేస్తే.. ఇంకొక సోదరుడు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల కోసం పార్టీ మారాడు అని బిక్షమయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. గురువారం బీజేపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఒంటికాలిపై లేచినంత పనిచేశారు.
Komatireddy Venkat Reddy: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని మరోసారి స్పష్టం చేశారు. తాను హోంగార్డు లాంటి వాడినన్న కోమటిరెడ్డి.. మునుగోడు ప్రచారానికి ఎస్పీ రేంజ్ లాంటి వాళ్లే వెళతారని అన్నారు.
Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నిక చేరువయ్యే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్ధులు సిట్టింగ్ స్థానం కోసం ప్రయత్నిస్తుంటే..టీఆర్ఎస్ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎటున్నారనేది కాంగ్రెస్ పార్టీకే అంతుచిక్కడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.