తెలంగాణలో మరో 450 రోజుల్లో కేసీఆర్ సర్కారు కూలడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్. ప్రజలంతా కేసీఆర్ పాలనతో విసిగిపోయారని... డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ కల కేవలం బీజేపీతోనే సాకారం అవుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో సమీపించనున్నాయి.త్వరలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై టీఆర్ఎస్ ( TRS ) అగ్రనాయకత్వం దృష్టి పెట్టగా...స్థానిక నేతల్లో మాత్రం ఆందోళన కలుగుతుందనే వార్తలు వస్తున్నాయి.
శ్రీశైలం విద్యుత్ కేంద్రం )( Srisailam power plant ) ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ..సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
ఓ చరిత్ర ముగుస్తోంది. తెలంగాణ ( Telangana) గడ్డపై నిజాం ( Nizams) నవాబుల కట్టడం నేలకొరిగింది. శతాబ్దానికి పైగా పాలనలో సేవలందించించిన ఆ భవన సముదాయం ఇకపై కన్పించదు. కొత్త రాష్ట్రానికి కొత్త సచివాలయం ( New Secretariat ) నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించి..కూల్చివేతను ప్రారంభించింది.
చేతి వృత్తుల వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. వారి సంక్షేమం కోసం తీసుకునే చర్యలను సంక్రాంతి పర్వదినం తర్వాత ప్రకటిస్తామని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.