Congress : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ బంపర్ మెజార్టీ సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక బీజేపీ 64 స్థానాలకే పరిమితమై చతికిలపడింది. కింగ్ మేకర్ అవుతుందని అనుకున్న జేడీఎస్ కేవలం ఇరవై స్థానాలకే పరిమితమైంది.
Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో శాసన సభా పక్ష నేతను కాంగ్రెస్ నేడు ఎన్నుకోనుంది. ఇక కర్ణాటక సీఎం అభ్యర్థిని కూడా నేడు ఖరారు చేయబోతోన్నారు.
Karnataka Elections 2023: కన్నడ కింగ్ అలియాస్ కింగ్ మేకర్ ప్రభ కోల్పోతోంది. అంతకంతకూ పట్టు కోల్పోతున్న ఆ పార్టీ ఈసారి మరింత చతికిలపడిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులు పెద్దఎత్తున డిపాజిట్లు కోల్పోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
Karnataka Elections Counting Updates: రేపు కర్ణాటక ప్రజల తీర్పు వెల్లడికానుంది. ఇప్పటికే తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేయగా.. శనివారం కౌంటింగ్ జరగనుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారితే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
Karnataka Exit Polls 2023: కర్ణాటక ఎన్నికల చిత్రం ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. అత్యధిక సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కడుతుంటే..రెండే రెండు సంస్థలు మాత్రం బీజేపీకు ఓటేశాయి.
Karnataka Exit Polls 2023: కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించనుందా అంటే పరిస్థితి అలాగే కన్పిస్తోంది. 2018 ఎన్నికల్లో పోషించిన పాత్రనే జేడీఎస్ పోషించవచ్చని తెలుస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
Karnataka Election Exit Poll Result 2023 Live. కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు పలు సంస్థలు వెల్లడించే 'ఎగ్జిట్ పోల్స్' అంచనాలపై అందరూ ఆసక్తి కనబర్చుతున్నారు.
Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల పోలింగ్ మే 10న జరగనున్నాయి. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
BJP Strategy Karnataka Assembly Elections 2023: ఎన్నికల వేళ పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయిన నాయకులపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో చేరి వాళ్లు పోటీ చేస్తుండగా.. ఆ స్థానాల్లో వారిని ఎలాగైనా ఓడించేందుకు అమిత్ షా డైరెక్షన్లో ప్రత్యేకంగా వ్యూహ రచన చేశారు. ఆ స్థానాలు ఏవంటే..?
Vote From Home In Karnataka Elections: పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయనుంది.
Ayanur Manjunath Quits From BJP: కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు అధికార బీజేపీకి రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నారో ఇంకా ప్రకటించలేదు.
Minister Nagaraju Assets: కర్ణాటక మంత్రి ఎమ్‌టీబీ నాగరాజు తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.1,609 కోట్లుగా ప్రకటించారు. గత ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.500 కోట్లు పెరిగాయి.
BJP Campaign Song: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో విభిన్న శైలి అనుకరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఈసారి వినూత్న ప్రచారాన్ని అందుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kiccha Sudeep Comments: ఈగ సినిమా పేరు చెప్పగానే రాజమౌళితో పాటు గుర్తొచ్చేది ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో చేరి మద్దతు ప్రకటించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించనుండటంతో పాటు తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం ఏర్పాటు కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా ముందు అధికార పార్టీ బీజేపీకు షాక్ తగిలింది. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీకు రాజీనామా చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.