ఐపీఎల్ (IPL 2020)ను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కరోనా నుంచి కోలుకుందన్న వార్త వినేలోగా మరో పిడుగులాంటి వార్త. ఐపీఎల్ కోసం పని చేస్తున్న బీసీసీఐ సీనియర్ వైద్య నిపుణుడికి కరోనా పాజిటివ్‌గా (BCCI Medical Team Member Tested COVID19 Positive) తేలింది.
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో (బుధవారం రాత్రి 8 గంటల వరకు) 2,817 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదు కాగా, 10 మంది మృతిచెందారు.
ఆటగాళ్లకు కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐపీఎల్ ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహణ నిమిత్తం 75 మందిని తీసుకున్నారు.
పెద్దన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ ఈరోజు యాంటీ బాడీస్ డొనేట్ చేశారని (Keeravani Donated AntiBodies) రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు డాక్టర్లు టెస్టులు చేశారని, ఇవ్వకూడదని తెలిపినట్లు చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో నిర్వహిస్తున్న పరీక్షలు కనుక ఈ ఏడాది కొత్త నిబంధన తీసుకొచ్చారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిట్ కార్డులు (JEE Main Hall Tickets) పరీక్షా కేంద్రంలోనే చెత్త బుట్టలో వేసి బయటకు రావాలి.
కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను వెంటాడుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA Chirla Jaggireddy Tests Positive For COVID) కరోనా బారిన పడ్డారు.
ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందు కరోనావైరస్ మహమ్మారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును అతలాకుతలం చేస్తోంది. ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2020 కోసం ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా (Suresh Raina).. ఐపీఎల్ టోర్నీకీ సైతం దూరమయ్యాడు.
Stress Management Tips | ఒత్తిడికి గురైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశం తగ్గుతుంది.
ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలను కరోనా వైరస్ మహమ్మారి వదలడం లేదు. కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవన్న (HD Revanna tests positive for COVID19) కరోనా బారిన పడ్డారు. కర్ణాటకలో ప్రముఖ నేతలంతా కరోనా బారిన పడుతున్నారు.
ఇటీవల వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఇచ్చిన పార్టీకి క్రికెటర్ క్రిస్ గేల్ హాజరయ్యాడు. దీంతో అతడికి కరోనా టెస్టులలో ఏం తేలుతుందోనని భయపడ్డారు. కానీ కోవిడ్19 టెస్టులలో గేల్‌కు నెగటివ్ (Chris Gayle tests negative for COVID-19)గా వచ్చినట్లు తెలిపాడు.
COVID19 Deaths In India Age Wise | కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో మధ్య వయసు నుంచి పెద్ద వయసులో ఉన్న వారే అధికమని సంఖ్య చెబుతుంది. యువతలో కోవిడ్19 మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. వారిలో రోగ నిరోధక శక్తి ఉండటమే అందుకు కారణం.
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1842 మంది కరోనా (CoronaVirus positive cases in Telangana) బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది.
కరోనా వైరస్ సోకిన బాధితుడిని పడవలో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మనకు ఇది వింతగా అనిపించినా పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.